• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నేడు సర్పంచులకు శిక్షణ తరగతులు

KMR: కళాభారతి ఆడిటోరియంలో సర్పంచులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి (DPO) మురళి తెలిపారు. గ్రామ పంచాయతీలకు కేటాయించే నిధుల వినియోగం, సర్పంచుల విధులు, బాధ్యతలపై ఈ సమావేశంలో పూర్తిస్థాయి అవగాహన కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల సర్పంచులు ఈ శిక్షణ తరగతులకు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.

March 12, 2026 / 07:30 AM IST

చైర్మన్ ను సన్మానించిన మహిళా మండలి సభ్యులు

WGL: మహిళల సాధికారత, సామాజిక సేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న నర్సంపేట మున్సిపల్ ఛైర్మన్ పెండెం లక్ష్మి రామానంద్‌ను కస్తూర్బా మహిళా మండలి సభ్యులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మహిళల అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల కోసం తాను కృషి చేస్తానని ఛైర్మన్ తెలిపారు. మహిళల్లో చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరారు.

March 12, 2026 / 07:30 AM IST

సర్పంచ్ బాబురావు మృతికి ఎమ్మెల్యే నివాళి

KMM: పాత కమలాపురం గ్రామ సర్పంచ్ తేజవత్ బాబురావు గుండెపోటుతో మరణించడం పట్ల ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆసుపత్రికి చేరుకుని, బాబురావు భౌతికదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

March 12, 2026 / 07:30 AM IST

కొత్తపల్లి కేజీబీవీ పాఠశాలలో తనిఖీ

NDL: కొత్తపల్లిలోని కేజీబీవీ పాఠశాలను మలేరియా అధికారులు బుధవారం తనిఖీ చేశారు. వంటశాల పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. దోమల వ్యాప్తిపై నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వంట గదిలో ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిర్వాహకులకు సూచించారు. విద్యార్థులు దోమ కాటుకు గురికాకుండా దోమతెరలను వాడాలని సూచించారు.

March 12, 2026 / 07:28 AM IST

ALERT: నేడే ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

గుంటూరు ANUలో ఇవాళ AP, ఈనెల 15న TG అభ్యర్థులకు ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ వాయులో ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. 2005 జూలై 2 నుంచి 2009 JAN 2 మధ్య జన్మించిన యువకులు అర్హులు. ఇంటర్/రెండేళ్ల ఒకేషనల్ కోర్సు లేదా మూడేళ్ల డిప్లొమా ఇంజినీరింగ్ పాసై ఉండాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లు, 6 జిరాక్స్ కాపీలు, ఆధార్, 10 పాస్ పోర్టు ఫొటోలతో ANUకు చేరుకోవాలి.

March 12, 2026 / 07:26 AM IST

జిల్లాలో రైతులకు రూ. 115.81 కోట్ల లబ్ధి

CTR: జిల్లాలో రైతులకు రూ. 115.81 కోట్ల లబ్ధి చేకూరింది. పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు శుక్రవారం రైతుల ఖాతాల్లో రూ. 6 వేలు జమ కానున్నాయి. అందులో రూ. 2 వేల చొప్పున రూ. 33.51 కోట్లు విడుదల కానున్నాయి. అలాగే అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 4 వేల చొప్పున 2,05,753 మంది రైతులకు రూ. 82.30 కోట్లు విడుదల చేయనుంది.

March 12, 2026 / 07:25 AM IST

జిల్లా కలెక్టర్‌పై CM చంద్రబాబు ప్రశంసలు

NLR: జిల్లాలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే వన్ మంత్ – వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్ కార్యక్రమాన్ని అమలు చేసినందుకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో CM మాట్లాడారు. ఈ వినూత్న విధానం ద్వారా భూ వివాదాలను గుర్తించి, దశలవారీగా పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు.

March 12, 2026 / 07:24 AM IST

ధాన్యం కొనుగోలుపై అధికారులతో జేసీ సమీక్ష

ELR: రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు ఏర్పాట్లపై జేసీ అభిషేక్ గౌడ సంబంధిత అధికారులు, కమిటీ సభ్యులతో సమీక్షించారు. కనీస మద్దతు ఏ గ్రేడు ఒక క్వింటా రూ. 2,389, 75 కేజీలు రూ.1,792, 40 కేజీలు రూ.956, సాధారణ రకం ఒక క్వింటాలు రూ. 2,369, 75 కేజీలు రూ.1,777, 4కేజీలు రూ. 948 మద్దతు ధర కల్పించడం జరిగిందని తెలిపారు.

March 12, 2026 / 07:24 AM IST

విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడులు, పెన్నుల పంపిణీ

JGL: వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో  టెన్త్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, ఒక్కొక్కరికి నాలుగు పెన్నులు పంపిణీ చేశారు. అదే గ్రామానికి చెందిన సామల రాజయ్య-లక్ష్మి దంపతులు ఈ సామగ్రిని పంపిణీ చేశారు. పరీక్షలు మంచిగా రాసి ఉన్నత లక్ష్యాలను సాధించాలని వారు విద్యార్థులకు సూచించారు.

March 12, 2026 / 07:21 AM IST

నేడు ఆలయాల వార్షికోత్సవాలు

VSP: వేపగుంట మండలం బంటాకాలనీ 92వ వార్డులోని దుర్గాదేవి, అభయాంజనేయస్వామి ఆలయాల వార్షికోత్సవాలు గురువారం జరుగుతున్నాయి. ఉదయం దుర్గాదేవికి దర్శనాలు, ఆంజనేయస్వామికి సింధూరార్చన, తమలపాకుల పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం భక్తులకు అన్నసమారాధన ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు భారీ ఏర్పాట్లు చేశామన్నారు.

March 12, 2026 / 07:20 AM IST

IIT మద్రాస్‌లో ఉద్యోగాలు.. ఇవాళే లాస్ట్

ఒప్పంద ప్రాతిపదికన IIT మద్రాస్‌లో 3 సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఇవాళ్టితో ముగియనుంది. BE/BTechలో ఉత్తీర్ణతతో పాటు సప్లై డిజైన్, మాగ్నెటిక్ కాంపోనెంట్ డిజైన్ PCB లేఔట్ తయారీలో నైపుణ్యం గలవారు అప్లై చేసుకోవచ్చు. నెలకు కనీస జీతం రూ.లక్ష.  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

March 12, 2026 / 07:17 AM IST

సర్వదర్శనానికి 12-15 గంటలు సమయం

TPT: తిరుమలలో 66,606 మంది భక్తులు నిన్న స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ తెలిపింది. 25,899 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని చెప్పారు. హుండీ ఆదాయం రూ. 4.78 కోట్లు వచ్చిందన్నారు. ప్రస్తుతం 25 కంపార్ట్‌మెంట్లు నిండగా, సర్వదర్శనానికి 12-15 గంటలు సమయం పడుతోందని పేర్కొన్నారు.

March 12, 2026 / 07:16 AM IST

‘మండల సర్వసభ్య సమావేశానికి అనుమతి ఇవ్వాలి’

అన్నమయ్య: తంబళ్లపల్లి MPDO కార్యాలయంలో ఇవాళ జరిగే మండల సర్వసభ్య సమావేశానికి ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులతో పాటు టీడీపీ నేతలకు అనుమతి ఇవ్వాలని ఎంపీడీవో బాపూజీ పట్నాయక్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఎంపీపీ శ్యామలా కోటిరెడ్డి, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులతో పాటు టీడీపీ మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, ఇతర నేతలకు అనుమతి ఇవ్వాలని కోరగా ఆయన ఆమోదించారు.

March 12, 2026 / 07:15 AM IST

అడ్మిషన్ టార్గెట్లతో ప్రైవేట్ టీచర్లకు కష్టాలు

GNTR: తెనాలిలో ప్రైవేట్ పాఠశాలల్లో కొత్త అడ్మిషన్ల కోసం టీచర్లపై యాజమాన్యాలు టార్గెట్లు విధిస్తున్నాయి. విద్యా సంవత్సరం పూర్తికాకముందే అడ్మిషన్లు తీసుకురావాలని ఒత్తిడి పెడుతున్నారు. టార్గెట్లు పూర్తి చేయకపోతే జీతాలు ఆపడం, ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరిస్తున్నారని టీచర్లు అంటున్నారు. దీంతో వారు ఇంటింటికీ తిరిగి అడ్మిషన్ల కోసం కష్టపడుతున్నారు.

March 12, 2026 / 07:15 AM IST

గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ACB రైడ్స్

E.G: ఏపీలో మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో జరుగుతున్న ACB సోదాలు అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. రాజమండ్రి కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సెక్షన్లో అర్ధరాత్రి వరకు ACB DSP కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. నేడూ సోదాలు జరగనున్నాయి. ఆమోదం పొందిన బిల్డింగ్ ప్లాన్స్, పెండింగ్ అప్లికేషన్స్, అక్రమ కట్టడాలకు చెందిన నోటీసుల ఫైళ్లను పరిశీలిస్తుంది.

March 12, 2026 / 07:14 AM IST