పూరీ బెలూన్‌లా ఉబ్బడం వెనుక ఒక చక్కని సైన్స్ ఉంది. పిండిలోని గ్లూటెన్ అనే ప్రోటీన్ ఒక సాగే పొరలా ఏర్పడి, వేడికి పుట్టే ఆవిరిని బయటకు పోనివ్వకుండా బంధిస్తుంది. నూనెలోని అధిక వేడి వల్ల పిండిలోని తేమ త్వరగా ఆవిరిగా మారుతుంది. ఈ ఆవిరి కలిగించే ఒత్తిడి వల్ల పూరీ ఉబ్బుతుంది. బయటి పొర గట్టిపడటం వల్ల ఆ ఆవిరి లోపలే ఉండి పూరీకి ఆ ఆకారాన్ని ఇస్తుంది.
MBNR: అమృత్ భారత్ స్టేషన్’ పథకం కింద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని రైల్వే స్టేషన్లు సరికొత్త రూపు సంతరించుకుంటున్నాయి. మహబూబ్ నగర్ (₹39.82 కోట్లు), జడ్చర్ల (₹36.67 కోట్లు), గద్వాల (₹42.82 కోట్లు), జోగుళాంబ (₹6.7 కోట్లు) నిధులతో పునరాభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. త్వరలోనే ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
JN: దేవరుప్పుల మండలం నీర్మాల గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక ఉచిత టీకాల కార్యక్రమంని నేడు గ్రామ సర్పంచ్ సంధ్యారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పశువుల ఆరోగ్యం రైతులకు అత్యంత ముఖ్యమని, సమయానికి టీకాలు వేయించడం ద్వారా గాలికుంటు వ్యాధిని నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్య అధికారి డా. సింధు ప్రియతో పాటు సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
VZM: జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బీ.వీ.సత్యనారాయణ కొత్తవలస జడ్పీ వారంతపు సంతను బుధవారం ఎంపిడివో రమణయ్యతో కలిసి సందర్శించారు. జడ్పీ వారంతపు సంతలో పలుసమస్యలపై గుత్తేదారు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిరుపయోగంగా ఉన్న కళ్యాణ మండపాన్ని త్వరలో వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. రైతుబజార్ ఏర్పాటుపై స్థలం పరిశీలనలో ఉందని చెప్పారు.
CTR: పలమనేరులో రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి పర్యటన సందర్భంగా బీసీ హాస్టల్ విద్యార్థులు వార్డెన్ శ్రీనివాసులు, వాచ్‌మెన్ మొగిలప్పపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వాచ్‌మెన్ మొగిలప్పను బైరెడ్డిపల్లికి బదిలీ చేస్తూ డీడీ రబ్బానీ ఉత్తర్వులు జారీ చేశారు. హాస్టల్ వార్డెన్ శ్రీనివాసులుకు సైతం మెమో జారీచేసినట్లు ఆయన తెలిపారు.
కృష్ణా: రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్న వ్యక్తిని బెదిరించి రూ.75 వేల నగదు బలవంతంగా బదిలీ చేయించుకున్న ఘటనపై H.జంక్షన్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. కొయ్యూరుకు చెందిన శ్యామ శంకర్ ఫిర్యాదుతో సురేష్, రవి, సుధీర్‌లపై కేసు నమోదు చేశారు. ఈ నెల 6న అతని వద్దకు వెళ్లి రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నావని, నీపై రౌడీషీట్ తెరిపిస్తామని బెదిరించారని ఫిర్యాదు చేశారు.
BDK: ఇల్లందు మున్సిపాలిటీలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం 3వ వార్డులో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వార్డు కౌన్సిలర్ అజ్మీరా వంశీ ఆధ్వర్యంలో మురుగు కాలువలను శుభ్రం చేయించి పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టణాలన్నీ సుందరంగా మారుతాయని అన్నారు.
NDL: కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం కోటి ఎకరాలకు పైగా భూములను 22ఏలో చేర్చి సమస్యలు సృష్టించిందని ఆయన ఆరోపించారు. 14 వేల ఎకరాలను బంజరు భూములుగా నమోదు చేశారని పేర్కొన్నారు. వ్యవసాయానికి టెక్నాలజీని అనుసంధానించి రాష్ట్రంలో 15.75 శాతం వృద్ధిరేటు సాధించాలన్నారు.
SRD: జనవరిలో జరిగిన రంగోత్సవ్ సెలబ్రేషన్ కాంపిటిషన్ 2025-26 ఇంటర్నేషనల్ ఆన్‌లైన్ కాంపిటిషన్లో సిర్గాపూర్ మండలం నల్లవాగు TGWRS పాఠశాల విద్యార్థులు తమ సత్తాచాటి బహుమతులు అందుకున్నారని ప్రిన్సిపాల్ తిరుపతయ్య నేడు తెలిపారు. ఇంటర్ విద్యార్థి సాయిరామ్ ట్రోఫీతో పాటు మిని ప్రొజెక్టర్, రెండో బహుమతిని, టెన్త్ విద్యార్థి అభయ్ బిగ్ క్రికెట్ కిట్ అందుకున్నాడన్నారు.
SRCL: తిరుపతి దర్శనం టికెట్ల పేరుతో విశ్రాంత ఉద్యోగిని మోసం చేసిన పూజారిపై బుధవారం కేసు నమోదైంది. బోయినపల్లి ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒద్యారం గ్రామానికి చెందిన విశ్రాంత ఉద్యోగి వద్ద వెంకటేశ్వర ఆలయ పూజారి సాయి తరుణ్ పలు విడతలుగా రూ.18 లక్షలు వసూలు చేశాడు. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
యంగ్ హీరో శివ కందుకూరి, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించిన ఎమోషనల్ డ్రామా చిత్రం ‘నవాబ్ కేఫ్’. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓల్డ్ సిటీ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు రవికాంత్ జెట్టి దర్శకత్వం వహించగా, ఆర్.ఎమ్. ప్రొడక్షన్స్ నిర్మించింది.
NRML: తానూర్ మండలంలో వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ సందర్శించారు. గురువారం రైతు వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఆదాయ వ్యయాలు, ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల వినియోగంపై సభ్యులకు అవగాహన కల్పించారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు నిధుల వినియోగంపై పూర్తి పట్టు సాధించాలని ఆయన సూచించారు.
NLR: ఆటోలో ప్రయాణిస్తూ కిందకు దూకగా డివైడర్ ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నెల్లూరు నుంచి కోవూరు వైపు వెళుతున్న ఆటోలో ఎక్కిన యువకుడు ఫ్లైఓవర్పైకి రాగానే ఆటోలో నుంచి దూకాడు. డివైడర్ ఢీ కొనడంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. అయితే యువకుడు ఎందుకు దూకాడో కారణాలు తెలియాల్సి ఉంది.
BHNG: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు బుధవారం రూ.12,14,835 ఆదాయం సమకూరినట్లు ఆలయ EO భవాని శంకర్ వెల్లడించారు. అందులో భాగంగా ప్రసాద విక్రయాలతో రూ.4,47,640, కార్ పార్కింగ్‌తో రూ.1,95,500, VIP దర్శనాలతో రూ.1,35,000, బ్రేక్ దర్శనాలతో రూ.81,300, ప్రధాన బుకింగ్‌తో రూ.1,05,700, వ్రతాలతో రూ.71,000, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.