• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రైలు ప్రమాదం.. రెండు కాళ్లు తొలగింపు

TPT: తడ(మం) తడకుప్పం సుజాతనగర్ పరిధిలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. కాంతమ్మ(60) రైల్వే ట్రాక్‌పై నిలిచిన గూడ్స్ రైలును దాటే ప్రయత్నం చేసింది. రైలు ఒక్కసారిగా కదలడంతో కిందపడిపోయి రెండు కాళ్లు కోల్పోయింది. స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రాథమిక చికిత్స అనంతరం చెన్నైకు రిఫర్ చేశారు.

March 12, 2026 / 02:20 PM IST

కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

NRPT: మక్తల్ మండలంలోని ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో పలు గ్రామాలకు చెందిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఇవాళ మంత్రి వాకిటి శ్రీహరి చెక్కులు అందజేశారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు సంతోషంగా జరగాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.

March 12, 2026 / 02:19 PM IST

అర్హులైన వారికే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని బిక్షాటన

MNCL: బెల్లంపల్లి పట్టణంలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ BJP నాయకులు గురువారం షాప్ షాపుకు తిరుగుతూ జోలె పట్టి బిక్షాటన చేశారు. అధికారులు విడుదల చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల జాబితా అంతా తప్పుల తడకగా ఉందన్నారు. ఇంటికి రూ. 3 లక్షలు వసూలు చేస్తూ జాబితాలో అనర్హులకు చోటు కల్పించారాని వారు ఆరోపించారు.

March 12, 2026 / 02:18 PM IST

అమరావతిలో క్రియేటివ్ సిటీ: సీఎం చంద్రబాబు

AP: కంటెంట్ క్రియేషన్‌ను ప్రోత్సహించేందుకు అమరావతిలో ‘క్రియేటివ్ సిటీ’ని ఏర్పాటు చేస్తామని CM చంద్రబాబు పేర్కొన్నారు. AI, ఫిలిం, కంటెంట్ క్రియేషన్ పరిశ్రమలకు పెద్దపీట వేస్తామని ప్రకటించారు. పాపికొండలు, సూర్యలంకను గోవాలా, గండికోటను భారత్‌కే తలమానికగా తీర్చిదిద్దుతామని తెలిపారు. తిమ్మమ్మ మర్రిమాను, కంభం చెరువు వంటి చారిత్రక ప్రదేశాల్లో మౌలిక వసతులు ఆకర్షించాలన్నారు.

March 12, 2026 / 02:17 PM IST

గ్లకోమపై అవగాహన సదస్సు

PPM: ఈ సృష్టిలో మానవునికి అన్నిటికంటే అపురూపమైనది, ప్రాధాన్యత కలది దృష్టి. కంటి చూపు లేకపోవడం అనేది ఒక శాపం అని జిల్లా నివారణ సంస్థ నేత్ర వైద్య అధికారి జీరు నగేష్రెడ్డి అన్నారు. గురువారం పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతీఒక్కరూ కంటి ఆరోగ్య సంరక్షణపై అవగాహన అవసరం అన్నారు.

March 12, 2026 / 02:16 PM IST

బీజేపీ సిద్ధాంతాలతో ఆకర్షితుడై పార్టీలో చేరిక

శ్రీకాకుళం రూరల్ మండలం బలగ గ్రామానికి చెందిన చిట్టి భాస్కరరావు బీజేపీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో గురువారం చేరారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తేజేశ్వరరావు ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇందులో శ్రీకాకుళం ఈస్ట్ మండల అధ్యక్షురాలు కనుగుల లలితకుమారి, తదితరులు పాల్గొన్నారు.

March 12, 2026 / 02:16 PM IST

ఎమ్మెల్యే ప్రజాదర్బార్‌కి 76 వినతులు

కోనసీమ: అమలాపురం పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమం నిర్వహించారు.  ఇందులో భాగంగా నియోజకవర్గ ప్రజల నుంచి మొత్తం 76 అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించారు. ప్రధానంగా పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు గురించి ప్రజలు.. ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

March 12, 2026 / 02:16 PM IST

మంత్రిని కలిసిన రాజ్యసభ సభ్యుడు

MHBD: రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డికి మంత్రి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కాసేపు మంత్రితో నరేందర్ రెడ్డి చర్చించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, తదితరులు ఉన్నారు.

March 12, 2026 / 02:16 PM IST

ప్రభుత్వ పథకాలపై అవగాహన అవసరం: కలెక్టర్

NGKL: జిల్లా కేంద్రంలో ఇవాళ నిర్వహించిన ప్రజాప్రతినిధుల అవగాహన సదస్సులో కలెక్టర్ బాదావత్ సంతోష్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజాప్రతినిధులు పూర్తి అవగాహనతో ముందుకు సాగాలని సూచించారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు గ్రామాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేయాలని పేర్కొన్నారు.

March 12, 2026 / 02:15 PM IST

సిద్దిపేట రైతు బజార్ బంద్

SDPT: సిద్దిపేట పట్టణంలోని రైతుబజార్ శుక్రవారం పూర్తిగా బంద్ ఉంటుందని ఏఎంసీ అధికారి నాగరాజు తెలిపారు. మార్కెట్ ప్రాంగణంలో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు ఈ మార్పును గమనించాలని, తిరిగి శనివారం నుంచి యధావిధిగా క్రయవిక్రయాలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.

March 12, 2026 / 02:15 PM IST

అమరావతిలో కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న కడప కలెక్టర్

KDP: అమరావతి రాష్ట్ర సచివాలయంలో జరిగిన 6వ జిల్లా కలెక్టర్ల సదస్సులో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పెట్టుబడులు, వైద్యం, సంక్షేమ పథకాలు, విద్య-నైపుణ్యాభివృద్ధి అంశాలపై చర్చించారు. మధ్యాహ్నం శాంతి భద్రతలపై సమీక్ష జరగనుంది.

March 12, 2026 / 02:15 PM IST

33వ వార్డులో ’99 రోజుల కార్యచరణ ప్రణాళిక’ ప్రారంభం

సిరిసిల్ల జిల్లాలోని నూతనంగా ఎన్నికైన 33 వార్డు కౌన్సిలర్ కొండ వర్షిణి-నరేష్‌లు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ’99 రోజుల కార్యచరణ ప్రణాళిక’ను ఇవాళ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వార్డు అభివృద్ధి దిశగా పనులను కొనసాగిస్తున్నామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులున్నా తమకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో 33వ వార్డు ఇంఛార్జ్ అలేఖ్య, ఆర్పీలు హేమలత, సునీత, తదితరులు పాల్గొన్...

March 12, 2026 / 02:13 PM IST

‘డెకాయిట్’: రీమిక్స్ వివాదంపై నిర్మాత క్లారిటీ

‘డెకాయిట్’లో ‘కన్నెపిట్టరో’ రీమిక్స్ వివాదంపై నిర్మాత సుప్రియ స్పందించింది. ఈ పాట హక్కులు ఆదిత్య మ్యూజిక్ వద్ద ఉన్నాయని, వారి నుంచి అధికారిక అనుమతి తీసుకున్నామని క్లారిటీ ఇచ్చింది. సంగీత దర్శకుడు కోటిని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడటంతో వివాదం సద్దుమణిగిందని తెలిపింది. సంగీత దర్శకుడు గ్యాని ఈ పాటను అద్భుతంగా రీమిక్స్ చేశారని, ఇది మూవీకి స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని చెప్పింది.

March 12, 2026 / 02:12 PM IST

వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

MBNR: దేవరకద్ర మండలం పాలెం గ్రామంలో గురువారం నిర్వహించిన మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇలాంటి మెగా వైద్య శిబిరాలు గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన యువతీ, యువకులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

March 12, 2026 / 02:12 PM IST

‘ట్రాక్టర్ డ్రైవర్లు ఈ నిబంధనలు పాటించాలి’

CTR: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టినట్లు కాణిపాకం ఎస్సై నరసింహులు తెలిపారు. ట్రాక్టర్లను నడిపేవారు నిబంధనలు పాటించాలని సూచించారు. బొమ్మసముద్రం, పైపల్లె గ్రామాలలో ట్రాక్టర్ డ్రైవర్లకు గురువారం అవగాహన కల్పించారు. రాత్రి సమయాలలో వాహనదారులకు ట్రాక్టర్లు స్పష్టంగా కనిపించేలా రేడియం స్టిక్కర్లు అతికించుకోవాలని సూచించారు.

March 12, 2026 / 02:10 PM IST