TPT: తడ(మం) తడకుప్పం సుజాతనగర్ పరిధిలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. కాంతమ్మ(60) రైల్వే ట్రాక్‌పై నిలిచిన గూడ్స్ రైలును దాటే ప్రయత్నం చేసింది. రైలు ఒక్కసారిగా కదలడంతో కిందపడిపోయి రెండు కాళ్లు కోల్పోయింది. స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రాథమిక చికిత్స అనంతరం చెన్నైకు రిఫర్ చేశారు.