• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సాయంత్రం ఆకలి వేస్తుందా..?

సాయంత్రం 4-5 గంటల మధ్యలో ఆకలి వేయడం సహజం. ఈ సమయంలో చాలామంది సమోసాలు, బిస్కెట్లు వంటి జంక్ ఫుడ్ తింటారు. దీంతో కొవ్వు, గ్యాస్ సమస్యలు వస్తాయి. వాటికి బదులు బాదం, వాల్‌నట్స్, వేయించిన శనగలు, పండ్లు తీసుకోవడం మంచిది. ఇవి శరీరానికి అవసరమైన ప్రోటీన్, విటమిన్లు అందించి ఆకలిని తీరుస్తాయి. ఈ ఆరోగ్యకరమైన అలవాటు బరువును నియంత్రించడమే కాకుండా, రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది.

March 12, 2026 / 03:50 PM IST

OTTలోకి వచ్చేసిన ‘మేడిన్ కొరియా’

నటి ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో దర్శకుడు రా.కార్తిక్ తెరకెక్కించిన మూవీ ‘మేడిన్ కొరియా’. ఈ మూవీ నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్‌ప్లిక్స్‌లో తమిళంతో పాటు తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. కొరియన్ డ్రామాలు, సినిమాలు ఇష్టపడేవాళ్లు ఈ సినిమాను చూడొచ్చు. కాగా, ఇందులో దక్షిణ కొరియా వెళ్లాలనే లక్ష్యం ఉన్న అమ్మాయిగా ప్రియాంక నటించింది.

March 12, 2026 / 03:50 PM IST

నకరికల్లులో రోడ్డు ప్రమాదం

PLD: నకరికల్లు మండలం చల్లగుండ్ల సమీపంలో గురువారం కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న లారీని మరో లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కోడిగుడ్లతో ఉన్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. రోడ్డుపై భారీగా కోడిగుడ్లు చెల్లాచెదురయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనపై పూర్త వివరాలు తెలియాల్సి ఉంది.

March 12, 2026 / 03:49 PM IST

రేణిగుంట విమానాశ్రయంలో లోకేష్‌కు ఘన స్వాగతం

TPT: నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం గురువారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి లోకేష్‌కు ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, నెలవెల విజయశ్రీ, బొజ్జల సుధీర్ రెడ్డి, పాశం సునీల్ కుమార్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి తదితర అధికారులు పాల్గోన్నారు.

March 12, 2026 / 03:48 PM IST

బైక్‌పై నుంచి పడి వ్యక్తికి తీవ్ర గాయాలు

MBNR: చిన్నచింతకుంట మండలం చిన్న వడ్డేమాన్ గ్రామ సమీపంలో గురువారం బోయ అంజి అనే వ్యక్తి బైక్‌పై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉండగా పోలీసులు గుర్తించారు. వెంటనే 108 అంబులెన్స్ ద్వారా జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు.

March 12, 2026 / 03:47 PM IST

సర్పంచుల ఫోరం అధ్యక్షుడికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు

NLG: తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, చిట్యాల మండల (పెద్దకాపర్తి సర్పంచ్) సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం జన్మదినం సందర్భంగా.. ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్‌లోని తన నివాసం వద్ద కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు ఆవుల సుందర్, కట్ట ఆశయ్య, చిట్యాల కనకదుర్గ అమ్మవారి గుడి ఛైర్మన్ మారగోని ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

March 12, 2026 / 03:45 PM IST

ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే

PLD: మాచర్ల ప్రభుత్వాసుపత్రిని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్ని వార్డులను పరిశీలించి, వైద్య సేవలు, మందుల అందుబాటు, పారిశుద్ధ్యంపై సమీక్షించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

March 12, 2026 / 03:44 PM IST

డిగ్రీ కళాశాల సమస్యలపై ఏవోకి వినతి

KMR: డిగ్రీ కళాశాల సమస్యలపై కలెక్టరేట్‌లో ఏవోకికి గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. పది రోజుల క్రితం డిగ్రీ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. కళాశాలను ముట్టడించిన అనంతరం ప్రిన్సిపల్ విజయ్, ప్రిన్సిపల్ కిష్టయ్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ముఖం చాటేసారని, సంబంధిత అధికారులను సస్పెండ్ చేసి డిగ్రీ కళాశాల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

March 12, 2026 / 03:44 PM IST

రేపు పీఎం కిసాన్ పథకం నిధులు జమ

AKP: నియోజకవర్గ స్థాయిలో ఈనెల 13న పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు పంపిణీ కార్యక్రమం కోటవురట్లలో జరగనుంది. హోంమంత్రి అనిత ఆదేశాల మేరకు స్థానిక వ్యవసాయ అధికారి కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు ఏవో సరోజిని పేర్కొన్నారు. పీఎం కిసాన్ పథకం నిధులు రూ.2,000, అన్నదాత సుఖీభవ పథకం నిధులు రూ.4,000 అర్హులైన రైతుల ఖాతాల్లో జమ అవుతాయన్నారు.

March 12, 2026 / 03:43 PM IST

పడిపోయిన గడ్డవాము.. ట్రాఫిక్‌కు అంతరాయం

బాపట్ల మండలంలోని వెదులపల్లి గ్రామం సమీపంలోని హైవే రోడ్డుపై ట్రాక్టర్ అతివేగంగా రావడంతో గడ్డివాము సైడుకి పడిపోయింది. దీంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ చిన్నపాటి ప్రమాదం గురువారం మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. 

March 12, 2026 / 03:42 PM IST

VIDEO: 108 అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం

WNP: టీచర్స్ కాలనీకి చెందిన జ్యోతికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. మదనాపురం అంబులెన్స్ అక్కడికి చేరుకుని ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈఎంటీ జ్యోతి, పైలెట్ నయీం సమయస్ఫూర్తితో ప్రసవం చేయగా తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు.

March 12, 2026 / 03:42 PM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన.. వార్డ్ కౌన్సిలర్

MHBD: కేసముద్రం మున్సిపాలిటీ బ్రహ్మంగారి తండాకు చెందిన బానోత్ సీతారాం గురువారం అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న 1వ వార్డు కౌన్సిలర్ జాటోత్ సుజాత- హరీష్ నాయక్ మృతుడి నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో స్థానికులు ఉన్నారు.

March 12, 2026 / 03:42 PM IST

పెళ్లిలో అన్నయ్య ఇచ్చిన సలహా అదే: అల్లు శిరీష్‌

నయనికతో పెళ్లి తర్వాత ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో అల్లు శిరీష్ తన అన్నయ్య అల్లు అర్జున్ ఇచ్చిన సలహా గురించి చెప్పాడు. ‘పరిస్థితులు ఎప్పుడూ మన చేతుల్లో ఉండవు. ఫంక్షన్‌లో డ్రెస్సులు సరైన సమయానికి రాకపోవచ్చు. ఆలస్యం కావొచ్చు. ఇలాంటి చిన్న విషయాలకు ఒత్తిడికి లోనవ్వద్దు. ఇవి నీ జీవితంలోనే మధురమైన క్షణాలు, ఏమీ ఆలోచించకుండా పెళ్లిని ఎంజాయ్ చేయి’ అని బన్నీ చెప్పినట్లు తెలిపాడు.

March 12, 2026 / 03:41 PM IST

యాదాద్రిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని తెలంగాణ గవర్నర్ శివ ప్రసాద్ శుక్ల దంపతులు గురువారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పూర్ణకుంభంతో ఆలయ అధికారులు అర్చకులు ఘనస్వాగతం తెలిపారు. స్వామి వారి దర్శనం అనంతరం కొండపైన శివాలయాన్ని దర్శించుకున్నారు. వారికి వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

March 12, 2026 / 03:40 PM IST

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 829.29 పాయింట్లు నష్టపోయి 76034.42 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 227.70 పాయింట్ల నష్టంతో 23639.15 దగ్గర ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92.21గా ఉంది.

March 12, 2026 / 03:40 PM IST