HYD: సికింద్రాబాద్‌లో గంజాయి విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్, చిలకలగూడ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఒడిశా నుంచి గంజాయిని రవాణా చేస్తున్న ముగ్గురు పెడ్లర్లతో పాటు నలుగురు వినియోగదారులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 11 కిలోల గంజాయి, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
ATP: పామిడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు సోమవారం ఎంపీడీవో తేజోష్ణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వ్యవసాయం, గృహాలు, రోడ్లు వంటి అంశాలపై చర్చించనున్నట్లు చెప్పారు. సమావేశానికి ఆయా శాఖల మండల అధికారులు, సర్పంచులు హాజరు కావాలన్నారు.
NLR: 10వ తరగతి ప్రశ్నాపత్రాలు బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాయి. ప్రశ్నాపత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి భద్రపరిచారు. ఈ సందర్భంగా ఎంఈవో-2 మాట్లాడుతూ.. మండల పరిధిలో ఏడు పరీక్ష కేంద్రాలలో 1041 మంది పరీక్షలు రాయనున్నారని తెలిపారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.
GNTR: తాడికొండ గ్రామంలో వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త, డైమండ్ బాబు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి, ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రారంభించారు.
KKD: పిఠాపురం ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో HPV (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకా 14 ఏళ్ల వయస్సు నిండిన బాలికలకు వేశారు. టీకా ప్రారంభం కార్యక్రమంలో జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్ చల్లా లక్ష్మి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV టీకా ఎంతో కీలకమని, అర్హులైన ప్రతి బాలిక టీకా వినియోగించుకోవాలన్నారు.
TPT: పిచ్చాటూరు, కేవీబీపురం ప్రాంతాల్లో దివ్యాంగులు, వయోవృద్ధులకు జీవన పరికరాల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన నిర్ధారణ శిబిరాలకు మంచి స్పందన లభించింది. వందలాది మంది హాజరై పరీక్షలు చేయించుకొని రసీదులు పొందారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొని వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.
కృష్ణా: గన్నవరం(M) కొండపావులూరులో ఉన్న NDRF కేంద్రంలో హెలిప్యాడ్‌ను MLA యార్లగడ్డ వెంకట్రావు గురువారం పరిశీలించారు. హెలిప్యాడ్ వద్ద భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలను పరిశీలించి ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని అధికారులకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్ రాకపోకలకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అధికారులు అక్కడి ఏర్పాట్లును వివరించారు.
MHBD: జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా ఇవాళ టాలెంట్ టెస్ట్‌లో గెలుపొందిన విద్యార్థులకు GCDO విజయ కూమారి బహుమతులు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చదువుతో పాటు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో SFI జిల్లా కార్యదర్శి పట్ల మధు, గందసిరి జ్యోతి బాసు, SFI నేతలు ఉన్నారు.
BDK: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విశేష కృషి చేస్తుందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. గురువారం చంద్రుగొండ మండల కేంద్రంలో డ్రగ్స్ నిర్మూలనపై నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపారు.
ICC తాజాగా విడుదల చేసిన టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అగ్రస్థానాన్ని కోల్పోయాడు. T20 WCలో 14 వికెట్లు తీసినప్పటికీ.. సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లలో ఎక్కువ పరుగులు ఇవ్వడం (ఎకానమీ 9.25) చక్రవర్తి ర్యాంకింగ్‌పై ప్రభావం చూపింది. దీంతో చక్రవర్తిని వెనక్కి నెట్టి ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ నెం.1 స్థానాన్ని దక్కించుకున్నాడు.
MBNR: పాలమూరు యూనివర్సిటీకి చెందిన NSS వాలంటీర్లు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్‌లో నిర్వహించిన నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఇవాళ వీసీ ప్రో. జిఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇలాంటి క్యాంపులు విద్యార్థుల్లో జాతీయ సమగ్రతను పెంపొందిస్తాయని తెలిపారు. NSS సమన్వయకర్త డా. కే. ప్రవీణ, కంటింజెంట్ లీడర్ సోమ్లా తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం: పొదిలి ప్రభుత్వ వైద్యశాలను రాష్ట్ర ఎన్‌సీడీ జాయింట్ డైరెక్టర్ శ్యామల తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, పరిశుభ్రత తదితర అంశాలను పలు విభాగాల్లో పరిశీలించారు. సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాల లోపం ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. అయితే ఆసుపత్రి పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. గుర్తించిన సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు.
BDK: భద్రాచలం ఐటీడీఏ గిరిజన భవన్లో శ్రీరామనవమి వేడుకలపై TSRTC సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. కరీంనగర్ డిపో మేనేజర్ సాల్మన్ ముఖ్య అథితిగా పాల్గొని మాట్లాడారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో బస్సులు నడపాలని వారు సూచించారు. ఈ నెల 27, 28న స్వామివారి కళ్యాణానికి భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉందన్నారు.
TG: సంగారెడ్డి జిల్లా 65వ నెంబర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బీరంగూడ నుంచి లింగంపల్లి వరకు వాహనాలు నిలిచిపోయాయి. హైవే విస్తరణ పనులు, వాహనాల రద్దీతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులు అక్కడ లేకపోవడం గమనార్హం.
BDK: చండ్రుగొండ మండల రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వం పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదర సోదరీమణులకు అందజేస్తున్న రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.