• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వినాయక చవితిలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు

HYD: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు GHMC కమిషనర్ కర్ణన్ తెలిపారు. వర్షాకాలంలో దెబ్బతిన్న క్యాచ్ పిట్‌లు, మ్యాన్ హోల్స్ మరమ్మతులు చేసి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు గుర్తించిన 11,741 పాట్ హోల్స్‌లో 8,330 మరమ్మతులు పూర్తి చేశామన్నారు.

August 21, 2025 / 09:34 AM IST

ఇడుపులపాయలో IIIT విద్యార్థి సూసైడ్

KDP: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం నెలకొంది. నరసింహనాయుడు అనే విద్యార్థి మృతి చెందాడు. గదిలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడని సమాచారం. మృతదేహాన్ని వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విద్యార్థిది శ్రీకాకుళం జిల్లా అని తెలుస్తుంది. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

August 21, 2025 / 09:33 AM IST

సొసైటీ ఉన్న.. అమ్మకాలు సున్నా!

MDK: రైతులు యూరియా కొరతతో సతమతం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నార్సింగి మండల కేంద్రంలో సొసైటీ ఆధ్వర్యంలో 1300 మంది సభ్యులు ఉన్న యూరియా అమ్మకాలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. రెండేళ్ల నుంచి వడ్ల కొనుగోలు కేంద్రాలపై చూపిస్తున్న ప్రేమ రైతులకు యూరియా పంపిణీ చేయడంపై చూపించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

August 21, 2025 / 09:30 AM IST

పాఠశాలలో విద్యుత్ స్తంభం మార్పు

BHNG: రాయగిరి ZPHSలో విద్యుత్ షాక్ ప్రమాదాలు నివారించడానికి పాత ఇనుప విద్యుత్ స్తంభం స్థానంలో కొత్త సిమెంట్ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఐరన్ స్తంభం వల్ల పిల్లలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఉపాధ్యాయులు మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ చింతల కృష్ణయ్య దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఆయన పాత స్తంభాన్ని తొలగించి, సిమెంట్ స్తంభాన్ని ఏర్పాటు చేశారు.

August 21, 2025 / 09:30 AM IST

తమకు రక్షణ కల్పించాలి: ప్రేమజంట

NLR: కందుకూరు చెందిన అఖిల్, దివ్య ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు. తమకు పెద్దల నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించారు. నెల్లూరు ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. తల్లిదండ్రులకు పోలీసులు రెండుసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా ఇంకా తమను బెదిరిస్తున్నారని వాపోయారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలన్నారు.

August 21, 2025 / 09:27 AM IST

షిరిడి సాయిబాబా ఆలయంలో శ్రావణ మాస పూజలు

ATP: గుత్తి శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో శ్రావణమాసం చివరి గురువారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేకువజామున సాయిబాబా ప్రతిమకు సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సాయిబాబా మూలమూర్తికి ప్రత్యేక పుష్పాలతో అలంకరించి కాకడ హారతి, అష్టోత్తర, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బాబా నామస్మరణతో ఆలయం మార్మోగింది.

August 21, 2025 / 09:27 AM IST

ఎమ్మెల్యేపై కేసు నమోదు

KRNL: అటవీ సిబ్బందిపై దాడి ఘటనలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జనసేన నేత అశోక్‌పై కేసు నమోదైంది. శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషనులో అటవీ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటన సీఎం చంద్రబాబు దృష్టికి చేరగా ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.

August 21, 2025 / 09:27 AM IST

క్రెడిట్ కార్డు నుంచి రూ. 1.99లక్షలు మాయం

NLR: ఈ ఘటన నెల్లూరు నగరంలో వెలుగు చూసింది. చిన్న బజార్ పోలీసుల వివరాల మేరకు.. మూలాపేటలోని మహేశ్వరి నగర్ శివ శంకర్ రావు నివాసం ఉంటున్నారు. ఆయనకు రెండు క్రెడిట్ కార్డులు ఉన్నాయి. వీటి నుంచి దశలవారీగా రూ.1.99 లక్షలు కట్ అయ్యింది. ఈ మేరకు మెసేజ్ రావడంతో శివశంకరరావు ఆందోళనకు గురయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

August 21, 2025 / 09:24 AM IST

స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ క్యాంటీన్లు మూసివేత

VSP: స్టీల్ ప్లాంట్‌లో 78 ప్రైవేట్ క్యాంటీన్లు మూసివేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఒక్కసారిగా యాజమాన్యం అనాలోచిత నిర్ణయంతో దాదాపు 510 మంది ఉపాధి కోల్పోగా లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. క్యాంటీన్‌లో పనిచేసిన కార్మికులకు సైతం పాసులు రద్దు చేయడంతో లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

August 21, 2025 / 09:23 AM IST

ఫ్రీ బస్.. విద్యార్థులకు కష్టాలు

చిత్తూరు జిల్లాలో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. పాకాల-చిత్తూరు మార్గంలోని విద్యార్థులు ఉదయాన్నే కాలేజీలకు వెళ్తుంటారు. గతంలో 8 బస్సులు ఉండగా.. ప్రస్తుతం నాలుగే తిరుగుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. ఫ్రీ బస్ కారణంగా మహిళా ప్రయాణికులు పెరిగారని.. సీట్లు లేకపోయినా సమయానికి కాలేజీలకు వెళ్లేందుకు ఇలా వేలాడుతూ వెళ్తున్నామని వాపోతున్నారు.

August 21, 2025 / 09:23 AM IST

రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

MNCL: మంచిర్యాలలోని రాజీవ్ నగర్‌కు చెందిన గాదె రాజేష్ అనే యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల – రవీంద్ర ఖని రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో అక్కడిక్కడే మరణించాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జీఆర్పీ ఎస్సై మహేందర్ ఆదేశాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ త...

August 21, 2025 / 09:20 AM IST

23న నిరసన కార్యక్రమాలు: తపస్

SRD: నూతన పెన్షన్ విధానం రద్దు చేయాలని కోరుతూ ఈనెల 23వ తేదీన నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి అన్ని మండల కేంద్రాలతో పాటు కలెక్టర్ కార్యాలయం ముందు కూడా నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

August 21, 2025 / 09:16 AM IST

సీఎం పర్యటనను విజయవంతం చేయాలి: MLA

KKD: సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. బుధవారం పెద్దాపురంలో టీడీపీ నేతలు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈనెల 23న చంద్రబాబు పెద్దాపురం పర్యటనకు వస్తున్నారన్నారు. కార్యక్రమ నిర్వహణకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.

August 21, 2025 / 09:15 AM IST

ఆశ్రమ పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులు

MHBD: జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఖాళీగా ఉన్న సీఆర్టీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ సబ్జెక్టు పోస్టు, ఫిజికల్ డైరెక్టర్ రెండు పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి దేశీరాం నాయక్ తెలిపారు. స్థానిక గిరిజన అభ్యర్థులకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని.. డిగ్రీ, బీఈడీ, బీపీడీ పూర్తి చేసి ఉండాలన్నారు.

August 21, 2025 / 09:12 AM IST

శ్రీశైలం MLA తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

NDL: అటవీ సిబ్బందితో శ్రీశైలం MLA రాజశేఖర్‌రెడ్డి వివాదంపై CM చంద్రబాబు ఆరా తీశారు. ఘర్షణ జరిగిన తీరుపట్ల ఎమ్మెల్యేపై ఆయన మండిపడ్డారు. వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై CM అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్నారు. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

August 21, 2025 / 09:10 AM IST