BPT: అద్దంకి మండలంలో విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం ప్రాముఖ్యత, వ్యాధుల నివారణ వంటి అంశాలపై వివరించారు. ప్రతిరోజూ శుభ్రత పాటించడం, సమయానికి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని విద్యార్థులకు సూచించారు.
GDWL: 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక శిక్షణలో భాగంగా ఇవాళ జిల్లా రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గుచూపాలని, ఆయిల్ పామ్ సాగు ద్వారా ఆదాయం పెంచుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. ప్రభుత్వ రాయితీలు, పథకాలపై ప్రజా ప్రతినిధులకు ఆయన వివరించారు. అలాగే పీఎం ధనధాన్య యోజన ద్వారా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
KDP: ప్రొద్దుటూరులో రిపోర్టర్ల వేధింపులు తట్టుకోలేక బియ్యం వ్యాపారి నజీర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. నిద్రమాత్రలు మింగిన ఆయనను ప్రాణాపాయ స్థితిలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యూట్యూబ్, టీవీ ఛానెల్ రిపోర్టర్లు, ఓ హోంగార్డు డబ్బుల కోసం వేధిస్తున్నారని సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు సమాచారం.
KNRL: విద్యార్థులు అందుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని సెట్కూర్ సీఈవో డాక్టర్ వేణుగోపాల్ సూచించారు. గురువారం ఉలిందకొండలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా అని అడిగి తెలుసుకున్నారు. బాలికల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని అయన తెలిపారు.
NDL: మండలంలోని ముత్యాలపాడు బస్టాండ్ సమీపంలో గురువారం కారు ఆటో ఢీకొన్న సంఘటనలో ముగ్గురు గాయపడ్డారు. బాచేపల్లి నుంచి చాగలమర్రికి వస్తున్న ఆటోకు ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొనడంతో బైక్ పైన వస్తున్న ఖాజావలికి కాలు విరగగా, రహంతుల్లా, మౌలాలీ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
SDPT: రంజాన్ మాసం సందర్భంగా సిద్దిపేటలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ఇఫ్తార్ విందును శుక్రవారం నిర్వహించనుంది. సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ పూజల హరికృష్ణ, పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ ఈ విషయాన్ని తెలిపారు. సిద్దిపేటలో జరిగిన సమావేశంలో శుక్రవారం సాయంత్రం మదీనా ఫంక్షన్ హాల్లో జరిగే ఈ విందుకు ముస్లిం ప్రజలు హాజరుకావాలన్నారు.
BDK: జిల్లా వెలుగుమట్ల బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, BRS పోరాటాల ఫలితంగానే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మణుగూరు మండలంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల సమస్యలపై పార్టీ నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు.
PDPL: ధర్మారం మండలం నరసింహులపల్లిలో కుమ్మరికుంట శంకరయ్య (73) అనే వ్యక్తి బుధవారం రాత్రి ఇంటిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. 6 నెలల క్రితం శంకరయ్య సైకిల్ పైనుంచి పడగా కాలులో రాడు వేశారు. రాడు నొప్పి భరించలేక, జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడని, కుమారుడు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
MHBD: కొత్తగూడ మండలంలోని ఏజెన్సీ ప్రాంత విద్యార్థుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. మారుమూల గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవకుండా ఉండాలనే లక్ష్యంతో మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ చూపి రూ. 5 కోట్ల నిధులతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని మంజూరు చేయించారు. ఈ సందర్భంగా ఇవాళ మంత్రి సీతక్క చిత్రపటానికి విద్యార్థులు, యువత, పాలాభిషేకం చేశారు.
AP: అటవీశాఖ అధికారులు పీపుల్ ఫ్రెండ్లీగా మారాలని సీఎం చంద్రబాబు సూచించారు. అటవీశాఖ అధికారుల వల్ల ఏర్పడ్డ ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు. అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలన్నారు. ఈసారి అటవీశాఖ విషయంలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. దీనిపై డిప్యూటీ సీఎంతో మాట్లాడానని.. మరోసారి మాట్లాడతానని తెలిపారు.
ప్రకాశం: కంభం పట్టణంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని వారి నివేదికలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వీరభద్ర చారి, తదితరులు పాల్గొన్నారు.
ASR: డుంబ్రిగూడ అంగన్వాడీ సెంటర్ పక్కన ఉన్న మంచినీటి బోర్‌వెల్ ను వెంటనే మరమ్మత్తు చేయాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి గురువారం డిమాండ్ చేశారు. బోర్‌వెల్ పనిచేయకపోవడంతో అంగన్వాడీ చిన్నారులు, మహిళలు, గ్రామస్తులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు.
ASR: డుంబ్రిగూడ అంగన్వాడీ సెంటర్ పక్కన ఉన్న మంచినీటి బోర్‌వెల్ ను వెంటనే మరమ్మత్తు చేయాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి గురువారం డిమాండ్ చేశారు. బోర్‌వెల్ పనిచేయకపోవడంతో అంగన్వాడీ చిన్నారులు, మహిళలు, గ్రామస్తులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు.
PPM: జిల్లాలోని గ్యాస్ వినియోగదారులు ఎటువంటి ఆందోళనకు గురికావద్దని, జిల్లాలో గ్యాస్ కొరత లేదని జిల్లా జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. యుద్ధ వాతావరణం నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడుతుందనే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నట్లు చెప్పారు. గ్యాస్ దొరకదనే కంగారు వద్దు అన్నారు.
కోనసీమ జిల్లాలో గ్యాస్ కొరత ఉండదని జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి స్పష్టం చేశారు. ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె అమలాపురం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక చర్యల మూలంగా గృహ వినియోగదారులకు యధావిధిగా సరఫరా కొనసాగుతుందని తెలిపారు.