KMR: నాగిరెడ్డిపేట మండలం బొల్లారం జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రిని బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి, బీఆర్ఎస్ నాయకులు పేరుపల్లి సాయిబాబా అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. మహా నేతల ఆదర్శాలను పాటించాలన్నారు. విజ్ఞానంతోనే సమాజంలో గౌరవం పెరుగుతుందన్నారు. చదువులు అలవర్చుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు.
KRNL: ఉగాది పండుగ సందర్భంగా శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్న భక్తుడు నందవరం(మం) పెద్ద కొత్తలి సమీపంలో ఎండ తీవ్రతకు స్పృహ కోల్పోయి అస్వస్థతకు గురయ్యాడు. అటుగా వెళ్తున్న ముగ్గురు పాత్రికేయులు గోవిందు, కుమార్, భీమన్న స్పందించి సీపీఆర్ చేయడంతో కొద్దిసేపటికి అతను స్పృహలోకి వచ్చాడు. అనంతరం తన పాదయాత్రను కొనసాగించాడు. పాత్రికేయులను స్థానికులు అభినందించారు.
ATP: జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర కామర్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు సెట్-I ప్రశ్నాపత్రాన్ని ఉపయోగించినట్లు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎం. వెంకటరమణ నాయక్ తెలిపారు. మొత్తం 5,223 మంది జనరల్ విద్యార్థులకు గాను 4,937 మంది హాజరు కాగా, 286 మంది గైర్హాజరయ్యారని ఆయన వివరించారు.
CTR: వీకోట(M) రాగిసముద్రం గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న 8 మందిపై కేసు నమోదు చేసినట్లు SI షేక్షావలి తెలిపారు. రామకుప్పం(M) కెంపసముద్రం గ్రామానికి చెందిన గంగాధర్, షేక్ మొహమ్మద్ అలీ, సురేష్, సత్యనారాయణ, రమేష్, PMK తాండకు చెందిన సింగిల్ నాయక్, జంగారెడ్డి, రామకుప్పం సర్పంచ్ మురళితోపాటు మరి కొంతమందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
TPT: నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రి లోకేష్ బాబు వెంట పయనిస్తున్న గూడూరు ఎమ్మెల్యే పీ. సునీల్ కుమార్ కారుకు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతిలోని రాజుపాలెం సున్నపు బట్టి వద్ద లోకేష్ కాన్వాయ్ కారును ఒక్కసారిగా ఢీకొనడంతో ఆయన కారుకు డ్యామేజ్ అయింది. ఎమ్మెల్యేకి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
ASF: చింతలమనేపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా నానయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. DCC సుగుణ, MLC దండే విఠల్, మాజీ జడ్పీ ఛైర్మన్ సిడెం గణపతి సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది. తనపై నమ్మకముంచి బాధ్యతలు అప్పగించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
MNCL: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లాలలోని ప్రజాప్రతినిధులకు గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో చెన్నూర్ మున్సిపల్ ఛైర్ పర్సన్ పెద్దింటి పద్మ శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ నాయకపు వినయ్ కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని వారు తెలిపారు.
TG: BRS నేత KTRపై భువనగిరి MP చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని KTR విమర్శించడం సరికాదని అన్నారు. ఒకసారి ఫామ్‌హౌజ్‌కు వెళ్లి KCRను అడిగితే అసలు విషయం KTRకు తెలుస్తుందని కౌంటర్ ఇచ్చారు. గతంలో పార్టీ ఫిరాయింపులు ఏ స్థాయిలో చేయవచ్చో కేసీఆర్ నిరూపించారని తెలిపారు.
కృష్ణా: పమిడిముక్కల మండలం వీరంకిలాకులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)ను పామర్రు MLA వర్ల కుమార్ రాజా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. PHC సిబ్బంది పనితీరు, ల్యాబ్ పరికరాలు, రిజిస్టర్లు, సిబ్బందికి ఉన్న సౌకర్యాలను సమీక్షించారు. వైద్యులు రోగులతో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. రోగుల అభిప్రాయాలు తెలుసుకుని సమస్యలు ఉంటే వెంటనే తెలియజేయాలని చెప్పారు.
NLG: దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ చింతపల్లి మండలంలో భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ. 4.75 కోట్లతో బీటీ రోడ్డు, రూ. 3.60 కోట్లతో 36 మహిళా సమాఖ్య భవనాలు మరియు వివిధ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం MLA ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి మాట్లాడుతూ.. పేదవాడి సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
NLR: మంత్రి నారా లోకేష్ నెల్లూరు పర్యటనలో భాగంగా బోగోలు మండలం కప్పరాల తిప్ప జాతీయ రహదారి వద్ద జిల్లా టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆయనను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అందరికీ అభివాదం చేస్తూ జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ శంకుస్థాపనకు బయలుదేరి వెళ్లారు.
WNP: జిల్లాలో నేటి ఫారదుల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ త్వరి తగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బి కమిషనర్ శివకుమార్ నాయుడు ఆదేశించారు. గురువారం వనపర్తి జిల్లాలో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న 197 ఎకరాల భూ సేకరణకు వెంటనే సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు.
PPM: పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలోని హోటళ్లు, భవనాలకు ఎటువంటి అనుమతులు లేవని వస్తున్న వార్తలపై మున్సిపల్ కమిషనర్ జి.శ్రీనివాసరాజు స్పందించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. మున్సిపాలిటీలో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియ అంతా పారదర్శకంగా, నిబంధనల మేరకే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. పురపాలిక పరిపాలనలో ఎటువంటి అవకతవకలు తావు లేదన్నారు.
BPT: సంతమగుళూరు మండలంలోని చవిటిపాలెంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని మండల పార్టీ అధ్యక్షుడు చేవూరు వాసిరెడ్డి, మండల మార్కెట్ యార్డ్ ఛైర్మన్ తేలప్రోలు రమేష్‌తో కలిసి ప్రారంభించారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు చల్లని తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
NZB: ఎర్రజొన్న, మొక్కజొన్న పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, కార్యదర్శి దేవారం డిమాండ్ చేశారు. పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మొక్కజొన్నకు ఎంఎస్పీ చెల్లించకుండా వ్యాపారులు కృత్రిమంగా రూ.1,600 చొప్పున కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.