TG: రాష్ట్రంలో మరో పదిహేనేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రజా పాలన మొదలైంది. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు, ఉచిత కరెంటు బిల్లు, ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా ఇస్తున్నాం’ అని చెప్పారు.
NZB: తెలంగాణ యూనివర్సిటీ ఓరల్ డెంటల్ హెల్త్ స్క్రీనింగ్ & ఎడ్యుకేషన్ క్యాంప్‌ను గురువారం నిర్వహించారు. NSS సెల్ 100 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథి ఉపకులపతి ఆచార్య టి. యాదగిరిరావు హాజరై మాట్లాడారు. దంత పరీక్షలు, నోటి పరిశుభ్రత ఆరోగ్యకరమైన నోటి అలవాట్లను వివరించారు.
ASR: అడ్డతీగల ప్రభుత్వ హాస్పిటల్ నందు డాక్టర్ మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ కిడ్నీ దినోత్సవంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలి అంటే తగినంత నీరు తాగుతూ ప్రతీ రోజు వ్యాయామం చేయాలన్నారు. పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. శారీరక శ్రమ కిడ్నీల పనితీరుకు మేలు చేస్తుందన్నారు.
AKP: సంపద కేంద్రాలను సక్రమంగా నిర్వహిస్తే పంచాయతీలకు ఆదాయం వస్తుందని ఎస్ రాయవరం డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ అన్నారు. గురువారం చినగుమ్ములూరు సంపద కేంద్రాన్ని పరిశీలించి, పారిశుధ్య కార్మికులకు సూచనలు సలహాలు ఇచ్చారు. తడి చెత్త పొడి చెత్త ఏ విధంగా వేరుచేయాలో వివరించారు. అనంతరం తిమ్మాపురం, రామయ్యపట్నంలో పారిశుధ్య పరిస్థితిని పరిశీలించారు.
జమ్మూలో మరో రెండు రోజుల పాటు పలుచోట్ల హిమపాతంతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా, కుప్వారా, దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లతో పాటు శ్రీనగర్‌లోనూ వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. నిన్న కుప్వారాలో 6.4 మి.మీ వర్షపాతం నమోదైందని, జోజిలా, జాంస్కర్‌లలో హిమపాతం నమోదైందని పేర్కొంది.
బీహార్‌కు చెందిన రితేష్ కుమార్ అనే యువకుడికి అధికారుల నిర్లక్ష్యం కారణంగా వింత అనుభవం ఎదురైంది. ఈ నెల 15న జరగనున్న పరీక్ష కోసం హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోగా.. అందులో తన ఫోటో ఉండాల్సిన చోట కుక్క బొమ్మ రావడంతో రితేష్ షాక్‌కు గురయ్యాడు. రిక్రూట్‌మెంట్ బోర్డు చేసిన ఈ ఘోర తప్పిదంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
NLG: చిట్యాలలో జరుగుతున్న ఉచిత గాలికుంటు నిరోధక టీకాల కార్యక్రమాన్ని పశుసంవర్ధక శాఖ జేడీ డా.జి.వి.రమేష్ ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాక్సినేషన్ రికార్డులను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పాడి రైతులు తప్పనిసరిగా పశువులకు టీకాలు వేయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారులు డా.అభినవ్, డా.అమరేందర్, రైతులు పాల్గొన్నారు.
SRD: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రావీణ్యతో ఇవాళ సంగారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్యరావు గురువారం సమావేశమయ్యారు. రెండు నియోజకవర్గాల్లో ఉన్న పెండింగ్ పనులపై కలెక్టర్‌తో చర్చించారు. నియోజకవర్గాల్లోని పెండింగ్ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు.
WNP: కొత్తకోట మండలం పాలెం గ్రామంలో అగ్రికల్చర్ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ కృపాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి ప్రారంభించారు. చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండల కేంద్రాలలో ఆసుపత్రి నిర్మాణాలను చేపడుతుందని అన్నారు.
PDPL: TG కౌన్సిల్ ఎన్నికల్లో గోదావరిఖని బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది చందాల శైలజ మెంబర్‌గా విజయం సాధించారు. జనవరి 30న జరిగిన ఈ ఎన్నికల ఫలితాలను గురువారం అధికారికంగా ప్రకటించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చరిత్రలోనే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఒక మహిళా న్యాయవాది విజయం సాధించడం ఇదే మొదటిసారి. దీంతో పలువురు న్యాయవాదులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
VSP: జీవీఎంసీ 30వ వార్డు అఫీషియల్ కాలనీలో రూ.38 లక్షలతో బీటీ రోడ్ పునరుద్ధరణ పనులకు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం కేజీహెచ్ పెడియాట్రిక్స్ వార్డులో పూర్వ విద్యార్థుల సహకారంతో ఏర్పాటు చేసిన రూ.80 లక్షల విలువైన ఐసీయూ పరికరాలను ప్రారంభించారు. మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు
HYD: రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో ఉద్యానయాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు మినీ ట్రాక్టర్లను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. రైతులు ఆధునిక పద్ధతులు, యంత్రాలను వినియోగించి సాగు ఖర్చును తగ్గించుకోవడంతో పాటు ఉత్పాదకతను పెంచుకోవాలన్నారు.
టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రాపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ప్రశంసలతో ముంచెత్తాడు. తాను చూసిన బౌలర్లలో బుమ్రానే అత్యుత్తమమని కొనియాడాడు. బుమ్రాను ఫుట్‌బాల్ దిగ్గజాలు మెస్సి, రొనాల్డోలతో పోల్చాడు. మైదానంలో బుమ్రా చూపించే ప్రతిభ అసాధారణమని అన్నాడు. ఒకవేళ తమ ఇంగ్లండ్ జట్టులో బుమ్రా ఉండి ఉంటే ఖచ్చితంగా వరల్డ్ కప్ గెలిచేవాళ్లమని వ్యాఖ్యానించాడు.
TPT: వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏర్పేడులో ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మహిళలకు 200 చీరలు పంపిణీ చేశారు.