• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

లిఫ్ట్ ప్రమాదం.. ఆరుగురు జర్నలిస్టులకు తీవ్ర గాయాలు

BHPL: జిల్లాలోని ప్రజాపాలన-ప్రగతి కార్యక్రమ కవరేజ్ కోసం ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌కు వెళ్లిన మీడియా మిత్రులకు పెద్ద ప్రమాదం జరిగింది. మూడో ఫ్లోర్ నుంచి లిఫ్ట్ కేబుల్ తెగిపోవడంతో లిఫ్ట్ కింద పడిపోయింది. లిఫ్ట్‌లో ఉన్న ఆరుగురు జర్నలిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని BHPL 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 12, 2026 / 05:43 PM IST

DEOకు వినతి పత్రం అందజేసిన.. విద్యార్థి సంఘాలు

HNK: నర్సరీ నుంచి 9వ తరగతి వరకు ఫీజుల వసూలు కోసం హాల్ టికెట్ల పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని TSF, TGVP, BSF విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఇవాళ HNK జిల్లా DEO గిరిరాజు గౌడ్‌కు విద్యార్థి సంఘాల నేతలు సునీల్, రాజేందర్, రంజిత్ వినతిపత్రం అందజేశారు.

March 12, 2026 / 05:42 PM IST

‘డయల్ యువర్ ఎస్పీ’కి విశేష స్పందన

NRPT: జిల్లాలో గురువారం నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్‌కి ఫిర్యాదుదారులు నేరుగా ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేశారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును త్వరితగతిన పరిష్కరిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. వాటిని చట్టం ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తామని బాధితులకు భరోసా కల్పించారు. 

March 12, 2026 / 05:40 PM IST

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య ఆరోగ్య శిబిరం

NRPT : ఊట్కూర్ మండల కేంద్రంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక వైద్య ఆరోగ్య శిబిరం గురువారం నిర్వహించారు. PHC డాక్టర్ రమావత్ సంతోషి పర్యవేక్షణలో వైద్య శిబిరంలో సుమారు 150 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆస్తమాలజీ డాక్టర్ సునీల్, ఆర్థోపెడిక్ డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్లు నరేష్, సంతోష్ పాల్గొన్నారు.

March 12, 2026 / 05:40 PM IST

‘ఈనెల 17న జర్నలిస్టులకు ఉచిత కంటి వైద్య శిబిరం’

ATP: జిల్లా వర్కింగ్ జర్నలిస్టులకు ఈ నెల 17న ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ జర్నలిస్ట్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నిత్యం కంప్యూటర్లపై పని చేయడం వల్ల జర్నలిస్టులకు కంటి సమస్యలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 12, 2026 / 05:40 PM IST

గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

NGKL: తాడూర్ మండలం నాగదేవపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని  ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధిలో గ్రామ పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకు ప్రభుత్వం గ్రామ స్థాయిలో సౌకర్యాలను పెంచుతున్నదని తెలిపారు.

March 12, 2026 / 05:39 PM IST

రూ.37.50 లక్షలతో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

RR: శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో మెరుగైన మౌలిక వసతులు కల్పనకు పెద్దపీట వేసామని PAC ఛైర్మన్ గాంధీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం ఆల్విన్కాలనీ డివిజన్ వాంబే గృహ సముదాయంలో రూ.37.50 లక్షల అంచనాతో నూతనంగా చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఆయనతో పాటు మాజీ కార్పొరేటర్ వెంకటేశ్ గౌడ్, జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు.

March 12, 2026 / 05:37 PM IST

చంద్రబాబును వదలను: జడ శ్రవణ్ కుమార్

AP: సీఎం చంద్రబాబుపై ప్రతి కేసును రీ ఓపెన్ చేయించి తీరుతానని జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ అన్నారు. ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల్లా అమ్మేస్తున్నారని, ఇది అన్యాయమని ప్రశ్నించిన తనపై కేసులు పెడుతున్నారని వాపోయారు. తన బినామీలకు ప్రభుత్వ భూములను అప్పనంగా కట్టబెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు అవినీతిలో అతిపెద్ద భాగస్వామి పవన్ కళ్యాణ్ అంటూ ధ్వజమెత్తారు.

March 12, 2026 / 05:36 PM IST

పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి: ఎమ్మెల్యే

జగిత్యాల పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో గురువారం 2026-27 బడ్జెట్ సమావేశం మున్సిపల్ ఛైర్ పర్సన్ తమిళనాడు వాణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు బాధ్యతాయుతంగా పని చేయాలని, వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

March 12, 2026 / 05:35 PM IST

‘డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక’

SRD: డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ పైలట్‌గా జిల్లా ఎంపికైనట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. సమావేశంలో కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు.

March 12, 2026 / 05:35 PM IST

అసెంబ్లీలో చర్చించాలని ఎమ్మెల్యేకు వినతి

MDK: గ్రామపంచాయతీ కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి సమస్యలు పరిష్కరించాలని గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు కడారి నర్సమ్మ కోరారు. గురువారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు. కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలన్నారు.

March 12, 2026 / 05:33 PM IST

‘గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం’

KNR: గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని, విధులు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి గ్రామాల స్వయం సమృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లాలోని సర్పంచులకు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

March 12, 2026 / 05:33 PM IST

పరిశుభ్రతపై దుకాణదారులకు అవగాహన

NLG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా చిట్యాల మండలం నేరడలో గురువారం మటన్, చికెన్ షాపుల వద్ద పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధంపై దుకాణ దారులకు సర్పంచ్ మిర్యాల వెంకటేశం, ఉప సర్పంచ్ మిర్యాల మహేందర్ తగు సూచనలు చేశారు. పర్యావరణ పరిరక్షణకు గ్రామస్తులు సహకరించాలని కోరారు.

March 12, 2026 / 05:32 PM IST

ఏయూలో వర్క్‌షాప్ పోస్టర్ ఆవిష్కరణ

విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 నుంచి 10 వరకు ఐదు రోజుల వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కే. రాంబాబు పాల్గొన్నారు.

March 12, 2026 / 05:31 PM IST

తిరుపతిలో చలివేంద్రం ప్రారంభం

తిరుపతిలో తీతీదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్, చీర్ల చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. AD బిల్డింగ్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఎండకాలంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు.

March 12, 2026 / 05:31 PM IST