HNK: నర్సరీ నుంచి 9వ తరగతి వరకు ఫీజుల వసూలు కోసం హాల్ టికెట్ల పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని TSF, TGVP, BSF విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఇవాళ HNK జిల్లా DEO గిరిరాజు గౌడ్‌కు విద్యార్థి సంఘాల నేతలు సునీల్, రాజేందర్, రంజిత్ వినతిపత్రం అందజేశారు.