TPT: నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం గురువారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి లోకేష్‌కు ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, నెలవెల విజయశ్రీ, బొజ్జల సుధీర్ రెడ్డి, పాశం సునీల్ కుమార్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి తదితర అధికారులు పాల్గోన్నారు.