• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రేపు జడ్పీలో ‘మహిళ జన్ సున్వాయ్’ కార్యక్రమం

AKP: మహిళల సమస్యలపై రేపు విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయంలో ‘ మహిళా జన్ సున్వాయ్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అనకాపల్లి జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారిణి సూర్యలక్ష్మి బుధవారం తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ ఆర్ శైలజ పాల్గొని మహిళల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తారని పేర్కొన్నారు.

March 12, 2026 / 07:14 AM IST

ఉర్సు ఉత్సవాల్లో వైఎస్ జగన్

AP: విజయవాడ భవానీపురంలో దర్గా ఉర్సు ఉత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా దర్గా ముజావర్ల కమిటీ ఉత్సవాలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఆహ్వానించింది. కమిటీ ఆహ్వానం మేరకు జగన్ సయ్యద్ గాలిబ్ షాషీద్ బాబాకు చాదర్, చందనం, శాండిల్ ఆయిల్ సమర్పించారు. అనంతరం భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.

March 12, 2026 / 07:14 AM IST

బదిలీపై వెళ్లిన ఎస్సైకి సన్మానం

KRNL: పెద్దకడబూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన ఎస్సై నిరంజన్ రెడ్డి బదిలీ కావడంతో బుధవారం స్థానిక నాయకులు ఆయనను సన్మానించారు. ఆయన సేవలను కొనియాడారు. పెద్దకడబూరులో విధులు నిర్వహించిన కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండి శాంతిభద్రతల పరిరక్షణలో కృషి చేశారని టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి తెలిపారు.

March 12, 2026 / 07:13 AM IST

నేడు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం కార్యక్రమం

GDWL: ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థంగా చేరవేసినప్పుడే ప్రజాపాలన లక్ష్యం నెరవేరుతుంది అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అనారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం బృందావన్ గార్డెన్స్‌లో నిర్వహించే కౌన్సిలర్లు, సర్పంచ్‌ల శిక్షణ ఏర్పాట్లను బుధవారం రాత్రి కలెక్టర్, ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు.

March 12, 2026 / 07:10 AM IST

నేడు రాష్ట్రవ్యాప్తంగా YCP ఆవిర్భావ దినోత్సవాలు

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(YCP)ని స్థాపించి 16 ఏళ్లు పూర్తై, 17వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో పార్టీ నేతలు వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా YCP అధినేత జగన్ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఉ.9:30 గంటలకు పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు.

March 12, 2026 / 07:10 AM IST

నేడు బాలికలకు HPV టీకా కార్యక్రమం

KDP: లింగాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం 14 ఏళ్లు నిండిన బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV టీకా ఇవ్వడం జరుగుతుందని డాక్టర్ ప్రసన్నకుమార్ తెలిపారు. బుధవారం ఆయన తెలుపుతూ.. బాలికలకు ఈ టీకా ఇవ్వడం వల్ల గర్భాశయ క్యాన్సర్ నివారించడం జరుగుతుందన్నారు. కావున బాలికల తల్లిదండ్రులు బాలికలను ప్రోత్సహించి ఈ టీకాలను వేయించాలని కోరారు.

March 12, 2026 / 07:10 AM IST

పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

MBNR: బాలానగర్ మండల కేంద్రంలో మూడు పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మండల వ్యాప్తంగా మొత్తం 640 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ముగ్గురు చీఫ్ సూపరింటెండెంట్లు, ముగ్గురు డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, 34 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయనున్నారు.

March 12, 2026 / 07:09 AM IST

రేపు నగరంలో జాబ్ మేళా

BPT: నగరంలోని శ్రీ వెలగపూడి రామకృష్ణ డిగ్రీ కళాశాలలో రేపు ఉద్యోగ మేళా ఉంది. దివీస్ ల్యాబ్‌లో పనిచేయడానికి ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు అర్హులు. ఉదయం 9 గంటలకు ధ్రువపత్రాలతో హాజరు కావాలని కరస్పాండెంట్ వల్లభనేని బుచ్చయ్య చౌదరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

March 12, 2026 / 07:08 AM IST

రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న ట్రావెల్స్ బస్సు

కోనసీమ: రావులపాలెం మండలంలోని ఈతకోట టోల్ గేట్ వద్ద తెల్లవారుజామున భారీ ప్రమాదం తప్పింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రయాణికులెవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

March 12, 2026 / 07:08 AM IST

బజార్ హత్నూర్‌లో డ్రైవింగ్ లైసెన్స్ మేళా

ADB: బజార్ హత్నూర్ మండల యువత డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ముందుకు రావాలని ఎస్సై సంజయ్ కుమార్ కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 18లోపు పోలీస్ స్టేషన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. ఆధార్ కార్డు, టెన్త్ మెమో, అడ్రస్ ప్రూఫ్ జిరాక్స్ పత్రాలతో మీ సేవా సెంటర్‌లో స్లాట్ బుక్ చేసి పత్రాలను పోలీస్ స్టేషన్‌లో అందజేయాలని సూచించారు.

March 12, 2026 / 07:08 AM IST

‘పరస్పర ప్రేమాభిమానాలకు ప్రతీకగా రంజాన్ నిలుస్తుంది’

MBNR: పరస్పర ప్రేమాభిమానాలకు రంజాన్ పండగ ప్రతీకగా నిలుస్తుందని మహబూబ్‌నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటుచేసిన పలు ఇఫ్తార్ వేడుకలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనార్టీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.

March 12, 2026 / 07:07 AM IST

గోరక్షాసనం వల్ల కలిగే ఉపయోగాలు

గోరక్షాసనం (కౌహెర్డ్ పోజ్) అనేది యోగాలో ఒక ముఖ్యమైన ఆసనం. ఇది శరీర సమతుల్యతను మెరుగుపరుస్తుంది. తోక ఎముక ఫ్లెక్సిబిలిటీని పెంచి, కదలికలను సులభతరం చేస్తుంది. కాళ్ల కండరాలను స్ట్రెచింగ్ చేసి, టోన్ చేయడం ద్వారా వాటిని బలోపేతం చేస్తుంది. శరీరం, మనస్సు మధ్య సమతుల్యతను పెంపొందిస్తుంది. నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది.

March 12, 2026 / 07:05 AM IST

ఆ పాఠశాల ప్రిన్సిపల్‌కు నోటీసులు

WGL: నగరంలోని కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు ఎం. నర్సయ్య నెలరోజులుగా పాఠాలు చెప్పకపోవడంతో డీఈవో బి. రంగయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎం.నర్సయ్యపై నెలరోజులుగా ఏలాంటి చర్యలు తీసుకోలేదని ప్రధానోపాధ్యాయురాలు ఆర్. మాధవికి కూడా నోటీసులు జారీ చేశారు. ఇద్దరూ మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

March 12, 2026 / 07:05 AM IST

ఎంజీయూలో బీటెక్ విద్యార్థుల ఆందోళన

న‌ల్ల‌గొండ‌లోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థులు బుధ‌వారం ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే అధిక మొత్తాన్ని వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు రిజిస్ట్రార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఫీజులు అదనంగా రూ.5 వేలు ఎందుకు తీసుకుంటున్నారో స్పష్టమైన సమాధానం ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

March 12, 2026 / 07:05 AM IST

కల్వరాల వాసికి జీవిత ఖైదు

WNP: వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన వడ్డే కురుమయ్యకు పోక్సో (POCSO) కేసులో జిల్లా జడ్జి సునీత జీవిత ఖైదు, రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. నిందితుడి భార్య ఫిర్యాదు మేరకు పెబ్బేరు పోలీసులు దర్యాప్తు చేపట్టి, నేరం నిరూపితం కావడంతో శిక్ష ఖరారు చేసినట్లు పోలీసులు తెలిపారు.

March 12, 2026 / 07:05 AM IST