KRNL: పెద్దకడబూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన ఎస్సై నిరంజన్ రెడ్డి బదిలీ కావడంతో బుధవారం స్థానిక నాయకులు ఆయనను సన్మానించారు. ఆయన సేవలను కొనియాడారు. పెద్దకడబూరులో విధులు నిర్వహించిన కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండి శాంతిభద్రతల పరిరక్షణలో కృషి చేశారని టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి తెలిపారు.