AP: విజయవాడ భవానీపురంలో దర్గా ఉర్సు ఉత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా దర్గా ముజావర్ల కమిటీ ఉత్సవాలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ను ఆహ్వానించింది. కమిటీ ఆహ్వానం మేరకు జగన్ సయ్యద్ గాలిబ్ షాషీద్ బాబాకు చాదర్, చందనం, శాండిల్ ఆయిల్ సమర్పించారు. అనంతరం భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.