అన్నమయ్య: పుంగనూరు జాతర సందర్భంగా రామసముద్రంలోని ఎంఎంపీ రమణరెడ్డి పుంగనూరు నివాసంలో బుధవారం విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు మదనపల్లి నియోజకవర్గ సమన్వయ కార్యకర్త నిస్సార్ అహ్మద్, మాజీ మార్కెట్ ఛైర్మన్ తట్టి శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు జాతర విశేషాలపై మాట్లాడుకుంటూ.. కొంతసేపు గడిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ATP: రేషన్ పంపిణీలో అవకతవకలకు పాల్పడితే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో రేషన్ డీలర్లు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు. తూకాల్లో మోసం చేసినా, సరుకులు నిలిపివేసినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ అందించాలని ఆదేశించారు.
ASF: కాగజ్ నగర్ పట్టణంలో ఈనెల 13న మినీ జాబ్ మేళ నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఏ రవికృష్ణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 10:35 గంటలకు జాబ్ మేళా ప్రారంభం అవుతుందన్నారు. ఆసక్తి గల అభ్యర్ధులు జాబ్ మేళలో పాల్గొనాలని సూచించారు. వివరాలకు 9392310323,798973351లో సంప్రదించాలన్నారు.
NDL: గ్యాస్ సిలిండర్ ధరను వెంటనే తగ్గించాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగకుండా నియంత్రించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు డేవిడ్ డిమాండ్ చేశారు. బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బండి ఆత్మకూరు(మం) ఏ.కోడూరులో ఖాళీ సిలిండర్లతో నిరసన తెలిపారు. యుద్ధం పేరుతో పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
MLG: 99 రోజుల ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా తాడ్వాయి మండలంలోని రామన్నగూడెం గ్రామంలో బుధవారం పారిశుద్ధ కార్యక్రమాన్ని చేపట్టారు. మంత్రి సీతక్క పిలుపు మేరకు గ్రామంలో ఉన్న డ్రైనేజీ, పూడికతీత పనులను చేపట్టారు. సర్పంచ్ గద్దల నవీన్ దగ్గరుండి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
KNR: చొప్పదండి సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాలలో బుధవారం (ఆర్ఎఎస్కె) హెల్త్ క్యాంపు నిర్వహించారు. డాక్టర్ నిశ్చల, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కీర్తన ఆధ్వర్యంలో PHC సిబ్బంది బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో మెనుస్ట్రువల్ హైజీన్, HPV వాక్సినేషన్, పోషకాహారం తీసుకోవడం, ఎనీమియాను ఎదుర్కొనే విధానాలు, పర్సనల్ హైజీన్ గురించి అవగాహన కల్పించారు.
TG: టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయపై మాజీ మంత్రి KTR ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో తెలంగాణపై ఎంపీ కృష్ణదేవరాయ చేసిన కామెంట్స్‌పై ఆయన స్పందించారు. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు అయిపోయిందని.. అభివృద్ధిలో దూసుకుపోతోందని కేటీఆర్ అన్నారు. ఏపీ, తెలంగాణ బాగుండాలని కోరుకుంటున్నామని.. తెలంగాణపై ఏడుపులు బంద్ చేయాలని తెలిపారు.
NTR: విజయవాడ పశ్చిమంలోని చిట్టినగర్ కొత్తపేటకు చెందిన మేదర హర్షిత UPSC సివిల్ సర్వీస్ పరీక్షల్లో 520వ ర్యాంక్ సాధించారు. బుధవారం ఆమెను జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు స్వగృహంలో సత్కరించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహమే తన విజయ రహస్యం అని హర్షిత చెప్పారు. ట్రాఫిక్ సీఐగా పనిచేస్తున్న తన తండ్రి సుధాకర్ ప్రజలకు సేవ చేస్తున్న తీరు తనకు స్ఫూర్తినిచ్చిందన్నారు.
TPT: సూళ్లూరుపేట ఎంపీడీవో కార్యాలయంలో జరగాల్సిన DVMC సమావేశం అనివార్యకారణాల వల్ల రద్దు చేసినట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వెల్లడించింది. మరోసారి మీటింగ్ గురించి తెలియజేస్తామని చెప్పారు. ఈ విషయాన్ని గమనించాలని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ కార్యాలయం తెలిపింది.
NTR: వీరులపాడులోని సన్‌రైస్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీని రెవిన్యూ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రవికుమార్ మాట్లాడుతూ.. గ్యాస్ ఏజెన్సీలు కృత్రిమ కొరత సృష్టించి సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల పరిధిలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని తెలిపారు.
KMR: 2026లో జరగనున్న జనగణన విధుల్లో ఎస్జీటీ ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలని కోరుతూ ఎస్జీటీ యూనియన్ సభ్యులు బుధవారం బాన్సువాడ ఎంఈవో నాగేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. 2025 వేసవి సెలవుల్లో శిక్షణలో పాల్గొన్న వారికి ELS ప్రొసీడింగ్ ఇవ్వాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో విధులు నిర్వహించిన వారికి CCL మంజూరు చేయాలన్నారు.
MDCL: ఉప్పల్ ఏసీపీ వెంకట్ రెడ్డిని ఎస్సీ–ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎల్లా సంతోష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉప్పల్ పరిధిలోని పలు అంశాలను ఏసీపీ దృష్టికి తీసుకెళ్లగా, సమస్యలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
SDPT: చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు ప్రాథమిక పాఠశాలలో బుధవారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రధానోపాధ్యాయులుగా హారిక, డీఈవోగా దీక్షిత్, ఎంఈవోగా యశ్వంత్ పలువురు విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంద , ఉపాధ్యాయులు పర్యవేక్షించారు.
KRNL: బీజేపీ రాష్ట్ర భవన నిర్మాణ కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన సీనియర్ నాయకులు విట్టా రమేష్‌ను ఆదోని పట్టణంలో ఇవాళ ఘనంగా సత్కరించారు. పట్టణ సెంట్రల్ అధ్యక్షులు తోవి నాగార్జున ఆధ్వర్యంలో భీమాస్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మండల కమిటీ అధికారులు పాల్గొని రమేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
SRCL: హైదరాబాదులోని నీరా కేఫ్ 2 సంవత్సరాలు నిర్వహించడానికి టెండర్లను ఆహ్వానిస్తున్నామని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సౌజన్య తెలిపారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో మంగళవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. గీత కార్మికుల సంఘాల నుంచి ఈ టెండర్లను ఆహ్వానిస్తున్నామన్నారు. ఈనెల 18 నుంచి 28వ తేదీ వరకు సిరిసిల్లలోని కలెక్టరేట్లో ఈ బిడ్‌లో పాల్గొనాలన్నారు.