MLG: వాజేడు మండలం పేరూరులోని అంగన్వాడీ సెంటర్-1 సందర్శనలో దళిత వార్డు మెంబర్ అరికిల్ల కౌసల్యకు అవమానం జరిగిందని దళిత నాయకులు ఆరోపిస్తున్నారు. అంగన్వాడీ సందర్శనలో భాగంగా సర్పంచ్ గొడ్డె సరోజినీ దేవిని కుర్చీలో కూర్చోబెట్టి, వార్డు మెంబర్ను నేలపై కూర్చోబెట్టారని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాప్రతినిధికి తగిన గౌరవం ఇవ్వలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Tags :