JGL: వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో టెన్త్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, ఒక్కొక్కరికి నాలుగు పెన్నులు పంపిణీ చేశారు. అదే గ్రామానికి చెందిన సామల రాజయ్య-లక్ష్మి దంపతులు ఈ సామగ్రిని పంపిణీ చేశారు. పరీక్షలు మంచిగా రాసి ఉన్నత లక్ష్యాలను సాధించాలని వారు విద్యార్థులకు సూచించారు.