GNTR: తెనాలిలో ప్రైవేట్ పాఠశాలల్లో కొత్త అడ్మిషన్ల కోసం టీచర్లపై యాజమాన్యాలు టార్గెట్లు విధిస్తున్నాయి. విద్యా సంవత్సరం పూర్తికాకముందే అడ్మిషన్లు తీసుకురావాలని ఒత్తిడి పెడుతున్నారు. టార్గెట్లు పూర్తి చేయకపోతే జీతాలు ఆపడం, ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరిస్తున్నారని టీచర్లు అంటున్నారు. దీంతో వారు ఇంటింటికీ తిరిగి అడ్మిషన్ల కోసం కష్టపడుతున్నారు.