• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఇది చీకటి అధ్యాయం: మహేశ్వర్ రెడ్డి

TG: కాంగ్రెస్ పాలనలో ఇది చీకటి అధ్యాయమని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. అన్యాయానికి క్లీన్ చిట్ ఇచ్చే తీర్పు అన్నారు. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇది క్లీన్ చిట్ కాదు.. ప్రజాస్వామ్యం మీద కొట్టిన దెబ్బ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఇవాళ ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ను స్పీకర్ డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే.

March 11, 2026 / 12:18 PM IST

లావణ్య త్రిపాఠి వేధింపుల కేసు.. దర్యాప్తు వేగవంతం

మెగా కోడలు లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో వేధింపులకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడి ఇన్‌స్టా ఐడీ, ఈ మెయిల్ వివరాలను గూగుల్ సంస్థ పోలీసులకు అందజేసింది. మరిన్ని వివరాల కోసం టెలికాం సంస్థకు పోలీసులు లేఖ రాయనున్నారు. టెలికాం సంస్థ నుంచి వచ్చే వివరాల ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించనున్నారు.

లక్ష్యం ఉంటేనే విజయం తథ్యం: కలెక్టర్

JN: లక్ష్యం ఉంటేనే విజయం తథ్యమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను బుధవారం సందర్శించి మాట్లాడారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణను పరిశీలించారు. 6, 8, 9, 10వ తరగతి గదుల్లో జరుగుతున్న బోధన విధానాన్ని గమనించి, విద్యార్థులతో మాట్లాడారు. ఇలాంటి ఇబ్బందులు ఉన్న వారికి తెలియజేయాలన్నారు.

March 11, 2026 / 12:18 PM IST

GHMC పరిధిలో జనగణనపై ఉన్నత స్థాయి సమీక్ష

HYD: GHMC పరిధిలో జనగణన ప్రక్రియపై నోడల్ ఆఫీసర్ భారతి హోలీకేరి (IAS) ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. GHMC కమిషనర్, జోనల్ కమిషనర్లు పాల్గొన్న ఈ భేటీలో.. ప్రతి ఇంటికి వెళ్లి కచ్చితమైన జనాభా వివరాలు సేకరించాలని ఆదేశించారు. అధికారులకు రెండు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన అనంతరం క్షేత్రస్థాయిలో జనగణన ప్రారంభం కానుంది.

March 11, 2026 / 12:17 PM IST

రైతు కుటుంబాలకు నీరు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకే తలమానికమైన సీతారామ ప్రాజెక్టు ద్వారా నకిరిపేట పరిధిలోని దోమల వాగును అనుసంధానం చేస్తూ మినీ రిజర్వాయర్ నుంచి తూము ద్వారా దిగువకు బుధవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నీరు విడుదల చేశారు. సుమారు ఎనిమిది వందల ఎకరాల గల వ్యవసాయ భూములకు రైతు కుటుంబాలకు నీరు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.

March 11, 2026 / 12:16 PM IST

కడపకు 50 విద్యుత్ బస్సులు

KDP: కాలుష్య నివారణలో భాగంగా ఆర్టీసీ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 1,500 విద్యుత్ బస్సులను వినియోగంలోకి తేనుంది. ఇందులో భాగంగా జిల్లాకు 50 బస్సులు కేటాయించారు. ఇవి త్వరలో అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలో కడప, రాజంపేట, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులి వెందుల డిపోలున్నాయి. ప్రస్తుతం వీటిల్లో 710 బస్సులు ఇంధనంతో సేవలు అందిస్తున్నాయి.

March 11, 2026 / 12:14 PM IST

దర్శి అద్దంకి మార్గంలో రోడ్డు ప్రమాదం

ప్రకాశం: ముండ్లమూరు మండలంలోని రెడ్డినగర్ వద్ద ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది . దర్శి వైపు నుంచి వస్తున్న ఎద్దుల బండిని రెడ్డినగర్ వద్ద లారీ వెనుకనుంచి ఢీకొట్టింది . ఈ ప్రమాదంలో ఎద్దుల బండి విరిగిపోయింది. ఎద్దులకు, ఇద్దరు మనుషులకు గాయాలయ్యాయి . క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కి తరలించారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియలిసి ఉంది .

March 11, 2026 / 12:13 PM IST

ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం

KNR: వివాదాలను పెంచుకుంటూ శత్రుత్వమే పెరుగుతుందని, రాజీ పడితే ఇద్దరు గెలిచినట్లేనని కేశవపట్నం ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. వివిధ కేసులతో కోర్టు చుట్టూ తిరుగుతున్న వారు ఈనెల 13న నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు, గొడవలు, మోసపూరిత ఒప్పందాలు, భూతగాదాలు, కేసులపై రాజీ పడితే రాజా మార్గమన్నారు.

March 11, 2026 / 12:10 PM IST

కోతుల బెడదతో ప్రజల ఇక్కట్లు

ఆసిఫాబాద్‌లో కోతుల బెడదతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోతులు గుంపులుగా తిరుగుతూ ఇళ్లపైకి ఎక్కి ఆహార పదార్థాలను దొంగిలించడం, ఇంటి వద్ద ఆడుతున్న చిన్నపిల్లలను భయపెట్టడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. రోజురోజుకీ కోతుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

March 11, 2026 / 12:10 PM IST

‘MLA పాయల్ శంకర్ అసత్య ప్రచారాలు మానుకోవాలి’

ADB: ఆదిలాబాద్ MLA పాయల్ శంకర్ కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న అసత్య ప్రచారాలు సరైనవి కావని గుడిహత్నూర్ మండల PACS మాజీ ఛైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గణేష్, మాధవ్ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశమై మాట్లాడారు. స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రైతు భరోసా నిధులకు జాప్యం జరిగిందని పేర్కొన్నారు.

March 11, 2026 / 12:10 PM IST

73 మందికి CMRF చెక్కులు పంపిణీ

NDL: సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి వంటిదని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం వేల్పనూరులో నియోజకవర్గానికి చెందిన 73 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.59 లక్షల విలువగల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

March 11, 2026 / 12:10 PM IST