NDL: సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి వంటిదని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం వేల్పనూరులో నియోజకవర్గానికి చెందిన 73 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.59 లక్షల విలువగల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.