భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకే తలమానికమైన సీతారామ ప్రాజెక్టు ద్వారా నకిరిపేట పరిధిలోని దోమల వాగును అనుసంధానం చేస్తూ మినీ రిజర్వాయర్ నుంచి తూము ద్వారా దిగువకు బుధవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నీరు విడుదల చేశారు. సుమారు ఎనిమిది వందల ఎకరాల గల వ్యవసాయ భూములకు రైతు కుటుంబాలకు నీరు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.