ప్రకాశం: ముండ్లమూరు మండలంలోని రెడ్డినగర్ వద్ద ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది . దర్శి వైపు నుంచి వస్తున్న ఎద్దుల బండిని రెడ్డినగర్ వద్ద లారీ వెనుకనుంచి ఢీకొట్టింది . ఈ ప్రమాదంలో ఎద్దుల బండి విరిగిపోయింది. ఎద్దులకు, ఇద్దరు మనుషులకు గాయాలయ్యాయి . క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలించారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియలిసి ఉంది .