BPT: పల్నాడు జిల్లా దాచేపల్లి సమీపంలోని నల్లవాగు వద్ద అద్దంకి–నార్కెట్‌పల్లి హైవేపై ఇవాళ కారు అదుపుతప్పి వాగులో పడింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.