TG: 2028 డిసెంబర్లోగా ప్రాజెక్ట్లు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. కాంట్రాక్టర్ల బిల్లులను వెంటనే విడుదల చేస్తామని వెల్లడించారు. భూసేకరణ, R&Rకు వేర్వేరుగా నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పనులు పెండింగ్లో పెట్టొద్దని సూచించారు. అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని హెచ్చరించారు.