SRCL: వేములవాడ పట్టణంలోని లాడ్జిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం, బెదిరింపుల కారణంగా భూక్య మోహన్(30)ను హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. శారద, ఆమె భర్త శేఖర్, స్నేహితుడు రవిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నేరానికి ఉపయోగించిన ద్విచక్రవాహనం, నైలాన్ తాడు, చాకును స్వాధీనం చేసుకున్నారు.