E.G: రాజమండ్రిలోని ప్రకాశం నగర్లో ఉన్న బార్కాస్ అరేబియన్ కిచెన్ రెస్టారెంట్‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిన్న ఆకస్మికంగా దాడులు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు రూ.70 వేల కోట్ల డిజిటల్ పేమెంట్లను ఆదాయంగా చూపకపోవడంతో ఈ దాడులు చేస్తున్నట్లు చెబుతున్నారు. రెస్టారెంట్లో జరిగిన వ్యాపారానికి పన్ను ఎగ్గొట్టినట్లు సమాచారం రావడంతో దాడులు చేశారు.