BHPL: టీ20 వరల్డ్ కప్ 2026ను గెలిచిన భారత జట్టుకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో జట్టు అద్భుత ప్రదర్శన చేసి టైటిల్ సాధించడం దేశ ప్రజలకు గర్వకారణమని అన్నారు. సమిష్టి కృషి, పట్టుదలతో న్యూజిలాండ్ పై ఫైనల్లో అద్భుత ఆటతీరు చూపారని MLA ప్రశంసించారు.