ఆదిలాబాద్ పట్టణంలోని AR హెడ్ క్వాటర్స్‌లో మంగళవారం (రేపు) మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ సందర్బంగా సుమారు 50 వరకు కంపెనీలు ఇందులో పాల్గొని దాదాపు 2000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధిత అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఆసక్తి గల నిరుద్యోగులు తమ ధ్రువపత్రాలతో రావాలన్నారు.