BHNG: రాయగిరి శ్రీ అయ్యప్ప స్వామి సేవ సమాజం భక్తులు బుధవారం నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. శాశ్వత అధ్యక్షునిగా పెద్దగాని శ్రీనివాస్ గురుస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఉపాధ్యక్షుడిగా నర్ర శేఖర్, ప్రధాన కార్యదర్శి మచ్చ రాజు, కోశాధికారి నర్ర బాలరాజు, సమన్వయకర్త కొత్త జాంగిర్, ప్రధాన సలహాదారుడు అవిశెట్టి మల్లేష్, సలహాదారుడు నీల కృష్ణలను ఎన్నుకున్నారు.