WNP: బహుజన ఆరాధ్య దైవం సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు బైపాస్ రోడ్డులో స్థలం కేటాయించాలని గౌడ సంఘం నాయకులు మున్సిపల్ ఛైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్‌కు బుధ వారం వినతిపత్రం సమర్పించారు. పాపన్న గౌడ్ స్ఫూర్తిని చాటేలా విగ్రహాన్ని నెలకొల్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మాచర్ల శ్రీనివాస్ గౌడ్, ఉమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.