VSP: మధురవాడ జోన్ ప్రణాళిక విభాగంలో ఏసీబీ అధికారుల తనిఖీలు బుధవారం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నిన్నటి దాడుల్లో స్వాధీనం చేసుకున్న దస్త్రాల ఆధారంగా క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మాణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. నిబంధనల ఉల్లంఘనలు, ఆమోదించిన ప్లాన్లకు భిన్నంగా ఉన్న నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు చేస్తున్నారు.