• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

దేవాలయంలో అదనపు ఎస్పీ పూజలు

MDK: జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ ఆదివారం చాకరిమెట్ల హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయ పూజారులు, నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా పూజారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

March 8, 2026 / 03:40 PM IST

చట్టసభలో సగం సీట్లతోనే సాధికారత: ఐద్వా సంఘం

WNP: చట్టసభలో సగం సీట్ల రిజర్వేషన్‌తో మహిళ సాధికారత హక్కుల సాధన సాధ్యమైందని ఐద్వా సంఘం అధ్యక్షురాలు కళావతమ్మ తెలిపారు. ఆదివారం వనపర్తి జిల్లా సీపీఐ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. చట్టసభలో 33 శాతం రిజర్వేషన్లు ఆమోదించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళలకు జరుగుతున్న వివక్షత అణిచి వేయాలన్నారు.

March 8, 2026 / 03:39 PM IST

OTTలోకి ‘కపుల్ ఫ్రెండ్లీ’.. ఎప్పుడంటే?

యంగ్ హీరో సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ OTT విడుదలకు సిద్ధమైంది. FEB 14న విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ పొందింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 13 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలుగు, తమిళ్‌తో పాటు ఇతర దక్షిణాది భాషల్లో కూడా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

March 8, 2026 / 03:39 PM IST

మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం: పొంగులేటి

KMM: మహిళా సంక్షేమంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాభవన్‌లో జరిగిన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో ప్రభుత్వం రూ.23 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించిందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళల పేరిటే ఇస్తున్నామని పేర్కొన్నారు.

March 8, 2026 / 03:37 PM IST

డ్వాక్రా సంఘాలకు రూ.36 కోట్ల చెక్కు అందజేత

ఏలూరు: నూజివీడు పట్టణంలో జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి హాజరయ్యారు. అనంతరం మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్బంగా 286 స్వయం సహాయక సంఘాలకు గాను సుమారు రూ.36 కోట్ల చెక్కును ఆయన అందజేశారు.

March 8, 2026 / 03:36 PM IST

రిటైర్మెంట్ హోమ్ ప్రారంభించిన మంత్రి

CTR: GD నెల్లూరు మండలం నేల్లేపల్లె గ్రామంలో డా. రామలక్ష్మమ్మ గార్డెన్‌లో నూతనంగా నిర్మించిన “శ్రీ నిలయం” రిటైర్మెంట్ హోమ్‌ను ఆదివారం జిల్లా ఇంఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఎస్ అముద, చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత పాల్గొన్నారు.

March 8, 2026 / 03:36 PM IST

మల్లికార్జున స్వామి దేవస్థానంలో పట్నాలు

SDPT: కోహెడ మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కోహెడలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మల్లన్న స్వామి పట్నాలు, ఒగ్గు కథల కార్యక్రమం నిర్వహించారు. ఒగ్గు పూజారులు స్వామివారి మహిమలను కథల రూపంలో వినిపించగా భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మండల యాదవ సంఘం అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.

March 8, 2026 / 03:35 PM IST

బాలికలకు ‘హెచ్పీవీ’ రక్షణ: కలెక్టర్

SRD: మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ నిర్మూలనకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఎంతో దోహదపడుతుందని సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 14–15 ఏళ్ల బాలికలకు వ్యాక్సినేషన్ కార్య క్రమాన్ని ప్రారంభించారు. ఈ వయస్సులోనే టీకా వేయించడంతో భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పు తప్పుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

March 8, 2026 / 03:35 PM IST

ఉత్తనూర్ గ్రామ సంఘాన్ని సందర్శించిన జెడ్పీ సీఈఓ

KMR: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా మూడో రోజు ఉత్తనూర్ గ్రామ సంఘాన్ని జడ్పీ సీఈఓ చందర్ సందర్శించారు. ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తడి-పొడి చెత్తను వేరుచేసే విధానంపై అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఎంపీడీఓ సంతోష్ కుమార్ ఉన్నారు.

March 8, 2026 / 03:35 PM IST

గ్యాస్ ధరల పెంపుపై సీపీఎం నిరసన

KNR: కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో వినూత్న నిరసన చేపట్టారు. పార్టీ శ్రేణులు గ్యాస్ సిలిండర్లను తలపై ఎత్తుకొని నిరసన తెలిపారు. తక్షణమే పెంచిన ధరలు తగ్గించాలని, సామాన్యులపై భారం మోపడం సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవా రెడ్డి డిమాండ్ చేశారు.

March 8, 2026 / 03:34 PM IST

టాలీవుడ్ యంగ్ హీరోకి నిశ్చితార్ధం..!

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్ధం చేసుకున్నాడు. HYDకి చెందిన ప్రముఖ న్యాయవాది కుమార్తె కావ్య రెడ్డితో సాయి శ్రీనివాస్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగినట్లు సమాచారం. దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ సంయుక్తా మేనన్ తదితరులు హాజరయ్యారు. త్వరలోనే పెళ్లి తేదిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

March 8, 2026 / 03:34 PM IST

కల్తీ పాల ఘటనలో 12కు చేరిన మృతులు

AP: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో మరో మహిళ మృతి చెందింది. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రామలక్ష్మీ(73) అనే వృద్ధురాలు ఇవాళ మరణించింది. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. కల్తీ పాల ప్రభావంతో అస్వస్థతకు గురైన మరో 9 మంది ఇంకా ఆస్పత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు.

March 8, 2026 / 03:33 PM IST

‘పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు ఒక వరం’

ADB: తలమడుగు మండలం ఖోడద్ గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ.. పేద ప్రజలకు గృహవసతి కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

March 8, 2026 / 03:33 PM IST

పెద్దపంజాణిలో 7 లీటర్ల సారా స్వాధీనం.!

CTR: ఎస్పీ ఆదేశాల మేరకు పెద్దపంజాణి పోలీసులు తనిఖీలు చేపట్టారు. పలు వాహనాలను తనిఖీ చేసి, అనుమానాస్పద వ్యక్తులను విచారించారన్నారు. ఈ తనిఖీలలో ఏడు లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మారెప్ప చెప్పారు. సారా తయారీకి ఉపయోగించే వస్తువులను సీజ్ చేసినట్లు ఆయన వెల్లడించారు.

March 8, 2026 / 03:32 PM IST

నేను అనే అహంకారం చాలా ప్రమాదం: ఎమ్మెల్యే

W.G: నేను అనే అహంకారం ప్రమాదకరమని, దానిని వీడితేనే నిజమైన దైవ దర్శనం కలుగుతుందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఉండి రోడ్డులోని శ్రీకాళీ వనశ్రమం భీమవరం శాఖ ప్రథమ వార్షికోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొని మాట్లాడుతూ.. భగవంతుని ఆరాధించడం పరిపూర్ణ విశ్వాసం ఉంచడం ద్వారా అనుకున్న పనులలో ఆటంకాలు తొలగుతాయన్నారు.

March 8, 2026 / 03:31 PM IST