KMM: మహిళా సంక్షేమంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాభవన్లో జరిగిన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో ప్రభుత్వం రూ.23 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించిందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళల పేరిటే ఇస్తున్నామని పేర్కొన్నారు.