యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్ధం చేసుకున్నాడు. HYDకి చెందిన ప్రముఖ న్యాయవాది కుమార్తె కావ్య రెడ్డితో సాయి శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగినట్లు సమాచారం. దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ సంయుక్తా మేనన్ తదితరులు హాజరయ్యారు. త్వరలోనే పెళ్లి తేదిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.