ఈ మధ్య దొంగలు బాగా అప్ డేట్ అయ్యారు. టెక్నాలజీ ఎలా అప్ డేట్ అవుతుందో దొంగలు కూడా అలాగే అప్ డేట్ అవుతూ స్మార్ట్ గా దొంగతనాలు చేసి కోట్లకు కోట్లు కొల్లగొడుతూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతూ జల్సాలు చేస్తున్నారు. కొందరు దొంగలు కేవలం ఏటీఎం మిషన్లనే టార్గెట్ చేసుకుంటారు. అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నా ముఖానికి ముసుగు వేసుకొని ఏటీఎంలను దోచుకుంటున్నారు. తాజాగా రాజస్థాన్ లోని అజ్మీర్ లో వరుసగా ...
విద్యార్థులు ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాయాలని.. అలా రాస్తేనే సత్ఫలితాలు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. చిన్నారులకు గెలుపోటములను సమానంగా తీసుకోవడం నేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఢిల్లీలోని తాల్కటోరా ఇండోర్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థు...
పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లక్ష్యంగా మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. ఇద్దరు నేతలు పాదయాత్రతో జనంలోకి వెళుతుండగా.. వారిని టార్గెట్ చేశారు. దీపంతో సిగరెట్ వెలిగించేవాడని తండ్రి గురించి పవన్ కల్యాణ్ ఓ సందర్భవంలో పేర్కొన్నారు. స్వర్గంలో ఉన్న తండ్రినే అవమానించిన పుత్రుడు ఈ సమాజానికి అవసరమా అని అడిగారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. యువగళం పేరుతో నారా లోకేశ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 400 రోజులు...
టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం మదనపల్లి నుంచి ప్రారంభమైంది. బొంరాస్‌పేటలో గల ఆంజనేయస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత పాదయాత్రను ప్రారంభించారు. మదనపల్లి నుంచి దుద్యాలకు సాగుతుండగా రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ కూలీలను పలకరించారు. రైతులు ఎదుర్కొంటున్న కష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు.పెట్టుబడి ఖర్చులు, మార్కెట్‌లో పంట...
మూడో భార్య రమ్య నుంచి తనకు ప్రాణ హానీ ఉందని సినీ నటుడు నరేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తి కోసం తనను చంపేందుకు ప్రయత్నిందని ఆరోపించారు. ఇదే విషయం కోర్టులో ఫిర్యాదు చేశానని వివరించారు. ప్రాణ భయంతో బయటకు వెళ్లడం లేదన్నారు. ఓ పోలీస్ అధికారి సాయంతో తన ఫోన్‌ను రమ్య హ్యాక్ చేయించిందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తన పర్సనల్ మెసేజ్ రమ్య చూసేదన్నారు. రమ్యతో విడాకులు ఇప్పించాలని కోరారు. గత ఏడాది ఏప్రిల్...
నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ఉదయం 11.03 గంటలకు లక్ష్మీపురం నుంచి ప్రారంభమైంది. యాత్ర ఆరంభంలో బ్యానర్ల చించివేత అంశం ఉద్రిక్తతకు దారితీసింది. కుప్పం చెరువు కట్ట మీద కౌన్సిలర్ సురేష్ ఏర్పాటు చేసిన బ్యానర్లను కొందరు దుండగులు చించివేశారు. దీంతో టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నారు. మరికొన్ని బ్యానర్లకు నిప్పు పెట్టారు. ఫ్లెక్సీలు చించివేత కుప్పంలో వివాదానికి దారి తీసింది. దీంతో లోకేష్ షెడ్యూల్‌లో స్వల్...
రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ గెలుచేల చేస్తామని అగ్రరాజ్యం అమెరికా పేర్కొన్నది. ఉక్రెయిన్ యుద్ధ సామర్థ్యాన్ని పెంచుతామని తెలిపింది. నాటో దేశాలతో కలిసి ఉక్రెయిన్ గెలుపు లక్ష్యంగా పని చేస్తామని వెల్లడించింది. పద్నాలుగు లెపర్డ్ యుద్ధ ట్యాంకులను సరఫరా చేస్తామని జర్మనీ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా ప్రకటన వచ్చింది. రష్యతో యుద్ధంలో గెలిచేలా సామగ్రి అందించడమే తమ మిత్ర దేశాల లక్ష్యం అని తెలిపింది. ఇప్పటికే...
పెన్షనర్లకు ఈపీఎఫ్‌వో షాక్ ఇచ్చింది. 70 ఏళ్లకు పైబడిన వారిపై ఇక బకాయిల భారం మోపనుంది. 2014 సెప్టెంబరుకు ముందు పదవీ విరమణ చేసిన వారిపై ఈ ప్రభావం ఉంటుంది. అధిక వేతనం ఉండి రిటైరయ్యే వారికి పెన్షన్ ఎక్కువే ఉంటుంది. ఆ అధిక పింఛనును ఈపీఎఫ్‌వో రద్దుచేసింది. అందుకు గల కారణాలను వెల్లడించింది. పింఛను పథకం సవరణకు ముందు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇవ్వని వారికి ప్రస్తుతం ఇస్తోన్న అధిక పెన్షన్ ఇవ్వరు. 20...
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనంగా మారుతుందని వాతావరణం శాఖ అధికారులు తెలిపారు. ఫలితంగా ఏపీలో 2 రోజులు చిరు జల్లులు పడనున్నాయి. ఇన్నాళ్లు చలి పులి భయపెట్టింది. కాగా త్వరలో చల్లని జల్లులు పలకరించబోతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తూర్పు భూమధ్య రేఖా ప్రాంతానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అదే ప్రాంతంలో శనివారం అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్...
టమాటా ధరలు రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఒక్కోసారి సెంచరీకి చేరే కిలో టమోటా రేటు..ఇప్పుడు ఒక్కసారిగా ఢమాల్ మంది. ఎప్పుడు ఏ ధర ఉంటుందో అర్థంకాక రైతులు అయోమయానికి గురవుతున్నారు. టమాటా ధరలు తీవ్రంగా పడిపోయాయి. కిలో 3 నుంచి 4 రూపాయలే పలుకుతోన్న ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. రైతులు ఆందోళనలో ఉన్నారు. కూలీలు, రవాణా ఖర్చులు సైతం రాక రైతులు దిగాలుపడతున్న స్థితి ఆందోళనకరంగా మారింది. ధర పతనం దారుణంగా...
టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తన గర్ల్ ఫ్రెండ్ మేహా పటేల్‌ను పెళ్లి చేసుకున్నాడు. వడోదరలో ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితుల సమక్షంలో వివాహా వేడుక జరిగింది. వధువరులు ఇద్దరు గుజరాతీ సాంప్రదాయం ప్రకారం వస్త్రాలు ధరించారు. పెళ్లి తర్వాత చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతుంది. ‘మాన్ మేరీ జాన్’ అనే పాటకు అక్షర్, మేహా కలిసి స్టెప్పులు వేశారు. వారిని అక్కడున్న వారు ఎంకరేజ్ చేశారు. ముందుగా అక్షర్ పటేల్ బౌల...
తన కెరీర్ లో చివరి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ లో భారత టెన్నిస్ దిగ్గజం సానియా కు నిరాశ ఎదురైంది. భారత ఆటగాడు రోహన్ బోపన్నతో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మిక్స్ డ్ డబుల్స్ లో బరిలోకి దిగిన సానియా రన్నరప్ తో సరిపెట్టుకుంది. మెల్ బోర్న్ రాడ్ లేవర్ ఎరీనాలో శుక్రవారం జరిగిన ఫైనల్లో సానియా-బోపన్న జంట 6-7 (2/6), 2-6 సెట్ల తేడాతో బ్రెజిల్ కు చెందిన లూయిసా స్టెఫాని-రఫేల్ మటోస్ […]
అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న డెక్కన్ మాల్ కూల్చివేత పనులు శర వేగంగా జరుగుతున్నాయి. గురువారం రాత్రి నుంచి భవనం కూల్చివేత పనులు సాగుతున్నాయి. చుట్టుపక్కల భవనలకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు పనులు చేయిస్తున్నారు. పోలీస్, ఫైర్ సిబ్బంది పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. భారీ క్రేన్ సాయంతో కూల్చివేత పనులు చేస్తోంది కాంట్రాక్ట్ సంస్థ. అయితే, ఇప్పటివరకు పది పన్నెండు శాతం పనులు మాత్రమే కంప్లీట్ చే...
అందాల నటి జమున తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందంతో కాక, అభినయంతో ఆకట్టుకున్నారు. మాతృ భాష తెలుగు కాకున్నా ఇక్కడి ప్రజలతో కలిసిపోయారు. కర్ణాటకలో గల హంపిలో 1936 ఆగస్ట్ 30వ తేదీన నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి దంపతులకు జమున జన్మించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో బాల్యం గడిచింది. జమునకు జనాభాయి అని పేరు పెట్టరాట.. జన్మ నక్షత్రం రీత్యా నది పేరు ఉండాలని జ్యోతిష్కు...
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ రాంచీ వేదికగా రాత్రి 7గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. కీవిస్ పై జరిగిన మూడు వన్డేల్లో గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి ఇండియా అదే ఊపుతో టీ20 సిరీస్‌లోను అద్భుత ప్రదర్శన కనబర్చేందుకు సిద్ధమైంది. అయితే, టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, షమీ వంటి సీనియన్ ఆటగాళ్లు లేకుండా హార్ధిక్ […]