• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గణతంత్ర దినోత్సవం వేళ బీహార్ లో ఎగిరిన పాకిస్తాన్ జెండా

ఇవాళ దేశమంతా 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర పరేడ్ ను నిర్వహించారు. అందరూ జాతీయ జెండాను ఎగురవేసి సెల్యూట్ చేశారు. సాయంత్రం అటారి, వాఘా బార్డర్ లోనూ బీటింగ్ రీట్రీట్ సెరమనీ జరిగింది. కానీ.. మన దేశంలో బీహార్ రాష్ట్రంలో పాకిస్తాన్ జెండా ఎగిరింది. పాకిస్తాన్ జెండా రెపరెపలాడటం స్థానికంగా కలకలం సృష్టించింది. బీహార్ లోని పుర్నియ...

January 26, 2023 / 08:11 PM IST

వైసీపీ నేత కారులో లిక్కర్ తరలింపు.. విచారిస్తున్న పోలీసులు

సరిహద్దు జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్‌‌కు మద్యం అక్రమ రవాణా జరుగుతోంది. అక్కడ ప్రీమియం లిక్కర్, లేదంటే చీఫ్ లిక్కర్ దొరుకుతుంది. దీంతో కొందరు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. పోలీసులకు సందేహాం కలిగి, పలు సందర్భాల్లో చెక్ చేస్తుంటారు. ఈ రోజు కడప జిల్లా ఖాజీపేట వద్ద తనిఖీ చేపట్టారు. కర్ణాటకకు చెందిన మద్యం భారీగా పట్టుబడింది. వైసీపీ నాయకుడి కారులో మద్యం దొరకడం విశేషం. బి.మఠం...

January 26, 2023 / 08:10 PM IST

జాగ్వార్ కారుకు జీ20 కలర్స్.. సూరత్ యువకుడి వినూత్న ఆలోచన

ఈసంవత్సరం జరగబోయే జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ సదస్సు సెప్టెంబర్ లో జరగనుంది. గత సంవత్సరం ఇండోనేషియాలోని బాలిలో జరిగింది. ఈసంవత్సరం మాత్రం భారత్ లో జీ20 సదస్సును నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో ఈ సదస్సు జరగనుంది. ఈనేపథ్యంలో గుజరాత్ లోని సూరత్ కు చెందిన ఓ యువకుడు తన జాగ్వార్ కారుకు జీ20 కలర్స్ వేశాడు. అంతటితో ఆగకుండా సూరత్ నుంచి జాతీయ రాజధాని ఢిల్లీకి చ...

January 26, 2023 / 07:26 PM IST

తిరుపతిలో జెండా పండగ.. ఆకట్టుకున్న పోలీసుల కవాతు

  తిరుపతి పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుపతి పోలీస్ సిబ్బంది నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది. ముఖ్య అతిథులుగా కలెక్టర్ కె వెంకటరమణా రెడ్డి, జిల్లా ఎస్పీ పి పరమేశ్వర రెడ్డి హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన వారికి కలెక్టర్ శుభాకాంక్షలను తెలిపారు. స్వాతంత్ర్యం రావడానికి ఎందరో త్యాగధనుల కృషి అని వివరించారు. సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా...

January 26, 2023 / 07:21 PM IST

రాష్ట్రపతి భవన్ లో ‘ఎట్ హోమ్’.. మోదీ హాజరు

At Home : గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ లో ఎట్ హోమ్ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రధాని మోదీతో పాటు గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారత్ కు విచ్చేసిన ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫత్తా, వైస్ ప్రెసిడెంట్ జగ్ దీప్ ధన్కర్, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ వైస్ ప్రెసిడెంట్ హమిద్ అన్సారీ హాజరయ్యారు. Delhi: President...

January 26, 2023 / 06:54 PM IST

వాఘా బార్డర్ లో ఘనంగా బీటింగ్ రీట్రీట్ వేడుకలు.. వీడియో

భారత స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా భారత్, పాక్ మధ్య ఉన్న అటారి, వాఘా బార్డర్ వద్ద వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. ఇవాళ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా పంజాబ్ లోని అమృత్ సర్ లో ఉన్న ఈ బార్డర్ వద్ద బీటింగ్ రీట్రీట్ సెరమనీని నిర్వహించారు. ఈ వేడుకకు చుట్టుపక్కన ప్రాంతాల నుంచి ప్రజలు విచ్చేస్తారు. అటు పాకిస్థాన్ దేశం నుంచి కూడా ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రెండు దేశాల జాతీ...

January 26, 2023 / 06:22 PM IST

తెలంగాణ సర్కార్ రాజ్యాంగాన్ని అవమానించింది: గవర్నర్

తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మరోసారి విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని తెలంగాణ సర్కార్ అవమానించిందని పేర్కొన్నారు. తమిళి సై సౌందరరాజన్ పుదుచ్చేరిలో మీడియాతో మాట్లాడారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు రాజ్ భవన్‌లో ఎట్ హోం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి కూడా సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు కావడం లేదని విశ్వసనీయ సమాచారం. ‘ప్రజల మధ్య గణతంత్ర వ...

January 26, 2023 / 06:21 PM IST

శ్రావణి వెనక బీజేపీ.. ఫేస్‌బుక్ లైవ్ ఎందుకు ఇచ్చింది: సంజయ్

‘సంజయ్ దొర మీకు దండాలు, మున్సిపల్ చైర్మన్ పదవీకి రాజీనామా చేస్తున్నా’ అని నిన్న జగిత్యాల మున్సిపల్ చైర్మన్ బోగ శ్రావణి మీడియా ముందుకు వచ్చారు. శ్రావణి ఆరోపణలపై అధికార పార్టీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించారు. శ్రావణి వెనక బీజేపీ నేతలు ఉన్నారని తిప్పికొట్టారు. ఈ విషయం కౌన్సిలర్లే తనకు ఫిర్యాదు చేశారని వివరించారు. ఆమె రాజీనామా చేయగా బీజేపీ ఫేస్‌బుక్ లైవ్ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ఆమెను తాను వే...

January 26, 2023 / 06:08 PM IST

రూ.18 వేల కోసం 16 ఏళ్ల బాలుడిని చంపేసిన యువకులు

Crime News : తమ దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని 16 ఏళ్ల బాలుడిని కొందరు యువకులు చంపేశారు. ఈ ఘటన ఢిల్లీలోని షాహ్ బాద్ డెయిరీ ఏరియాలో చోటు చేసుకుంది. వాళ్లు 16 ఏళ్ల బాలుడికి రూ.18 వేలు ఇచ్చారు. చాలా రోజులు అయినా ఆ బాలుడు వాళ్లకు డబ్బులు తిరిగి ఇవ్వలేదు. దీంతో అతడిపై కక్ష పెంచుకున్న ఆ యువకులు అదును చూసి చంపేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు […]

January 26, 2023 / 06:07 PM IST

రూ.20 కే వైద్యం చేసే డాక్టర్ ను వరించిన పద్మశ్రీ

ఆయన సీనియర్ డాక్టర్. అయినా సరే రూ.20 కే వైద్యం చేస్తాడు. ఆయన డాక్టర్ అయినప్పుడు కేవలం రూ.2 కే వైద్యం చేసేవారు. ఫీజును ఈ మధ్య రూ.20 చేశారు. ఆయన పేరు డాక్టర్ మునిశ్వర్ చందర్ దావర్. వయసు 77. రోజూ దాదాపు 200 మంది పేషెంట్లను చూస్తారు. వాళ్ల నుంచి కేవలం రూ.20 మాత్రమే వసూలు చేస్తారు. 1967 లో మునిశ్వర్ జబల్ పూర్ లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 1971 లో భారత్, […]

January 26, 2023 / 05:51 PM IST

పొత్తులపై పవన్ నాలుగో ఆప్షన్ ఇస్తే బాగుండేది: సజ్జల

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెస్ట్ ఆర్టిస్ట్‌లా వచ్చి టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్తారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. పొత్తుల గురించి ఆయన చెప్పిన మూడు ఆప్షన్స్ వింటే నవ్వొస్తోందన్నారు. షరతులు లేకుండా చంద్రబాబుకి సపోర్టు చేయడం అనే నాలుగో ఆప్షన్ కూడా చెప్పాల్సిందని ఎద్దేవా చేశారు. గత రెండు ఎన్నికల మాదిరిగా ఈసారి కూడా పవన్ రిమోట్ చంద్రబాబు చ...

January 26, 2023 / 05:50 PM IST

తొలి రోజే వసూళ్లతో దుమ్ములేపిన పఠాన్.. 100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్

Pathaan : పఠాన్ మూవీ రిలీజ్ కి ముందే చాలా అవాంతరాలు వచ్చాయి. సినిమాను విడుదల కానివ్వకుండా చాలామంది అడ్డుకున్నారు. అయినా కూడా అన్ని అడ్డంకుల మధ్య పఠాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ దాదాపు 5 ఏళ్ల తర్వాత మళ్లీ వెండి తెర మీద చరిత్ర సృష్టించాడు. వసూళ్ల సునామీని సృష్టించాడు. ఓవర్ ఆల్ గా సినిమా విడుదలైన తొలి రోజే రూ.100 కోట్ల వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు […]

January 26, 2023 / 05:34 PM IST

హల్వా వండిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఇవాళ ఆర్థిక మంత్రత్వ శాఖలో హల్వా వండారు. హల్వాను వండి తన చేతులతో అందరికీ అందించారు. సాధారణంగా బడ్జెట్ ప్రతులను ప్రింట్ చేయడానికి ముందు హల్వాను వండి శాఖలోని అధికారులు అందరికీ వడ్డించడం ఆనవాయితీ. ఫిబ్రవరి 1న కేంద్రం 2023-24 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. బడ్జెట్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రింటింగ్ ప్రక్రియను తాజాగా ప్రారంభించారు. హల్వా...

January 26, 2023 / 04:47 PM IST

గూగుల్, మైక్రోసాఫ్ట్ బాటలో మరో కంపెనీ.. 3000 మందికి ఉద్వాసన

SAP Layoff : ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీలో లేఆఫ్స్ జరుగుతున్నాయి. ఏదో చిన్న కంపెనీలలో అయితే పెద్దగా ఇప్పుడు మనం దీని గురించి చర్చించుకునే వాళ్లమే కాదు. కానీ.. ప్రపంచంలోనే టాప్ కంపెనీలు అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, అమెజాన్ లాంటి సంస్థలు తమ కంపెనీలలో దశాబ్దాలుగా పని చేస్తున్న ఉద్యోగులను కూడా తొలగించాయి. ఒకేసారి వేల సంఖ్యలో ఉద్యోగాలను తీసేయడంతో ఐటీ ఉద్యోగులు షాక్ అవుతున్నారు. కేవలం ఈ కంపెనీలే...

January 26, 2023 / 04:31 PM IST

18 ఏళ్ల కుర్రాడిలా కనిపించడానికి ఏడాదికి 16 కోట్లు ఖర్చు పెడుతున్న 45 ఏళ్ల వ్యక్తి

ఎవ్వరికైనా యవ్వనం అనేది చాలా ముఖ్యమైన దశ. యంగ్ గా ఉన్నప్పుడే చాలా అందంగా కనిపిస్తాం కానీ.. ఆ యవ్వనం ఎక్కువ రోజులు ఉండదు. వయసు 30 దాటిందంటే అంతే.. యవ్వనం పోయి వయసు మీదపడినట్టుగా కనిపిస్తుంది. వయసు మీద పడుతున్న కొద్దీ వయసు మళ్లిన వాళ్లలా కనిపిస్తాం. యంగ్ గా కనిపిస్తేనే కదా అమ్మాయిలు కూడా చూసేది. ముసలివాళ్లను ఎవరు చూస్తారు. అందుకే కాబోలు 45 ఏళ్ల ఓ వ్యక్తి 18 ఏళ్ల కుర్రాడిలా కనిపించడానికి […]

January 26, 2023 / 04:13 PM IST