ATP: గరుగు చింతలపల్లి చెరువుకు నీరు విడుదల చేయకపోవడంపై వైసీపీ మండల అధ్యక్షుడు పొన్నపాటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాకే శైలజానాథ్ నాయకత్వంలో అధికారులకు విన్నవించినా ఫలితం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రెండేళ్లుగా చెరువు ఎండిపోవడంతో సాగు, తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదన్నారు.
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ వివాహ రిసెప్షన్ వేడుకకు స్టార్ క్రికెటర్లు హాజరయ్యారు. ఈ వేడుకకు రోహిత్ శర్మ తన భార్య రితికా సజ్దేతో కలిసి విచ్చేశారు. వీరితో పాటు యువరాజ్ సింగ్, ఆశిష్ నెహ్రా, సురేష్ రైనా తదితర ప్రముఖ క్రికెటర్లు హాజరై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం SMలో వైరల్ అవుతున్నాయి. కాగా ధావన్, సోఫీ షైన్‌ల వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.
ప్రకాశం: ఒంగోలులో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ‘మీకోసం కార్యక్రమం’ (PGRS), రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజా బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల స్థాయిలలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. అలాగే, నమోదైన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు
SKLM: పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పనే లక్ష్యమని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. గార మండలం సతివాడ పంచాయతీ యాలపేట గ్రామంలో ఉన్న పాఠశాలలో రూ 3.8 లక్షలతో మరుగుదొడ్లు, రూ 9.8 లక్షలతో పాఠశాల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యం పట్ల భద్రత పరిరక్షణ అవసరం అన్నారు.
PLD: వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం బొగ్గరంలో ఆదివారం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
సూపర్-8 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై శ్రీలంక బౌలర్లు విజృంభించారు. దీంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఫిలిప్ సాల్ట్ (62) అర్ధసెంచరీతో ఒంటరి పోరాటం చేయగా, మిగిలిన బ్యాటర్లంతా ఘోరంగా విఫలమయ్యారు. లంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే 3, మహేష్ తీక్షణ, మధుశంక తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
MHBD: తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామానికి చెందిన రైతు 3 ఎకరాల భూమిని కౌలు తీసుకోని మొక్కజొన్న పంట సాగు చేస్తున్నాడు. పంట సాగులో వచ్చే దిగుబడి కూలీలకు, ఎరువుల ఖర్చులకు సరిపోతుందని రైతు HIT TV కి తెలిపారు. కోతులు పంటను నాశనం చేస్తున్నాయని, ఈ పంటకు సరైన నీటి సౌకర్యం లేదని వాపోయారు. పంట మంచిగా పండితే ఎకరానికి 40 క్వింటాల దిగుబడి వస్తుందని తెలిపారు.
వనపర్తి నాగవరం తండాలోని గురుకుల కేంద్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి జరిగిన ప్రవేశ పరీక్షలు ముగిశాయి. మొత్తం 669 మంది విద్యార్థులకు గాను 654 మంది హాజరుకాగా, 15 మంది గైర్హాజరైనట్లు ఇంఛార్జ్ ప్రిన్సిపల్ అర్చన తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
PLD: చిలకలూరిపేట టిడ్కో గృహాల వద్ద రూ. 3.60 కోట్లతో నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్‌కు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం శంకుస్థాపన చేశారు. 5,520 కుటుంబాలకు సౌకర్యంగా ఉండేలా 30 దుకాణాలతో దీన్ని నిర్మిస్తున్నామన్నారు. ఇక్కడ నివాసముంటూ ఉపాధి లేని వారికే ఈ షాపులు కేటాయిస్తామని ఆయన తెలిపారు. ఆరు నెలల్లోగా ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు.
RR: నందిగామ(మం) మామిడిపల్లిలో మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణ మహోత్సవానికి వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా వీక్షించి తరించారు. స్వామి కరుణ ఎల్లప్పుడూ తమపై ఉండాలని భక్తులు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
KRNL: పెద్దకడబూరు మండలంలోని రంగాపురం గ్రామంలో కొండపై వెలసిన శివాలయంలో ఆదివారం విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామ ప్రజలను చల్లగా చూడాలని ఆకాంక్షించారు.
దర్శకుడు బోయపాటి శ్రీను, యంగ్ హీరో గాలి కిరీటీ కాంబోలో ఒక భారీ యాక్షన్ మూవీ రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తనదైన మాస్ ఎలివేషన్లతో హీరోలను పవర్‌ఫుల్‌గా చూపించే బోయపాటి, కిరీటిని ఎలా ప్రెజెంట్ చేస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, కిరీటీ ‘జూనియర్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
SKLM: కోటబొమ్మాలి ఎంపీడీవో కార్యాలయం ఎదుట దివంగత నేత, కలింగుల ఆరాధ్య దైవం స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాలరావు 34వ వర్ధంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ పేరాడ తిలక్ ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఉమామల్లయ్య, గోవిందరావు, సత్యరాజు, సతీష్, తదితరులు ఉన్నారు.
TG: ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీలోని పలు మండలాల్లో దాదాపు గంట పాటు భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. పత్తి పంట తడిసి ముద్దవగా.. రబీ పంట వేసిన రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండ వేడి ఉండగా ఒకేసారి భారీ వర్షం కురవడంతో.. ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది.
KNR: తిమ్మాపూర్ మండలం మహాత్మ నగర్ గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కపంపల్లి సత్యనారాయణ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.