• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

viral:రైల్వే ట్రాక్‌ పక్కనే మార్కెట్.. విజిటేబుల్స్‌తోపాటు గ్రీజు

మార్కెట్ అంటే బండి నుంచి మొదలు సూపర్ మార్కెట్ వరకు ఉంటాయి. కొందరు సైకిళ్ల మీద తిరిగి విక్రయిస్తుంటారు. టూరిస్ట్ స్పాట్ థాయ్‌లాండ్‌లో మాత్రం వెరైటీ మార్కెట్ ఉంది. అవును రైల్వే ట్రాక్ పక్కన్ ఉండటమే విశేషం. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. మీరు కూడా ఆ వీడియోను ఓ సారి చూడండి. థాయ్‌లాండ్‌లో ఫేమస్ మెక్‌లాంగ్ రైల్వేస్టేషన్. ఇది సముత్ సాంగ్‌ఖ్రామ్ ప్రావిన్స్‌లో ఉంది....

January 25, 2023 / 10:04 PM IST

పద్మ అవార్డులు: తెలంగాణకు 2 పద్మభూషణ్.. మిగతావి వీరికే..

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పౌర పురస్కరాలైన పద్మ అవార్డులను బుధవారం ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన, అందిస్తున్న ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రకటిస్తుంది. ఈ సందర్భంగా బుధవారం మొత్తం 106 పద్మ అవార్డులు ప్రకటించింది. ఆరుగురికి పద్మవిభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీ...

January 25, 2023 / 10:05 PM IST

మనమంతా ఒక్కటే: రిపబ్లిక్ డే స్పీచ్‌లో రాష్ట్రపతి ముర్ము

మనమంతా ఒక్కటే.. భారతీయులం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 74వ రిపబ్లిక్ డే సందర్భంగా ఆమె జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో మతాలు, పలు భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నా.. అంతా కలిసి మెలసి ఉంటున్నారని తెలిపారు. అందుకోసమే భారత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విజయం సాధించిందని తెలిపారు. మనమంతా కలిసే ఉంటున్నామని, భారత్ అంటే ఒక జాతి అని పేర్కొన్నారు. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఙాన్, జై...

January 25, 2023 / 09:31 PM IST

రాజ్ భవన్‌లోనే రిపబ్లిక్ డే పరేడ్.. ఉ.6.50 గంటలకు ప్రారంభం

రిపబ్లిక్ డే వేడుకలు, పరేడ్‌పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది. దీంతో ప్రభుత్వం పరేడ్‌కు సంబంధించి నిర్ణయం తీసుకుంది. గురువారం రాజ్ భవన్‌లోనే పరేడ్ నిర్వహిస్తామని తెలియజేసింది. ఉదయం 6.50 గంటలకు రాజ్ భవన్‌లో పరేడ్ జరుగుతుంది. ఆ తర్వాత ఏడు గంటలకు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. వేడుకకు అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరవుతారు. తెలంగాణ రాష్ట్రంలో రిపబ్ల...

January 26, 2023 / 05:35 PM IST

భారీ ఎత్తున తెలంగాణలో ఐపీఎస్ ల బదిలీలు

తెలంగాణలో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఏకంగా 60 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పోలీస్ శాఖను ప్రక్షాళన చేసినట్టు బదిలీలు ఉన్నాయి. ఒకే చోట అత్యధిక కాలం ఉన్న అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. పలు జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు బదిలీ అయిన జాబితాలో ఉన్నారు. ఈ బదిలీల విషయమై రెండు రోజులుగా సీఎం కేసీఆర్ డీజీపీ, ఇతర ఉన్...

January 25, 2023 / 08:52 PM IST

మంచినీరు ఇచ్చేందుకు బ్రిటిష్ మహిళ నిరాకరించారు: పవన్

ఏదో ఒక సమయంలో ప్రతీ ఒక్కరు వివక్షకు గురవుతారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. అప్పుడే దాని గురించి తెలుస్తుందని వివరించారు. తాను కూడా వివక్షకు గురయ్యానని చెప్పారు. బ్రిటీష్ ఎయిర్ వేస్ లో ప్రయాణిస్తున్న సమయంలో తనకు నీళ్లు ఇవ్వడానికి ఓ బ్రిటీష్ మహిళ నిరాకరించారని గుర్తుచేశారు. వ్యక్తి ఆరాధన ప్రమాదకరం అని పవన్ కల్యాణ్ అన్నారు. సమాజాన్ని సమగ్రంగా చూడాలని చెప్పారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో బ...

January 25, 2023 / 08:36 PM IST

జగన్ కోసం నా ఆస్తులు అమ్మేసి తప్పు చేశా: పృథ్వీ

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ సినీ పరిశ్రమలో గుర్తింపు పొందిన హాస్య నటుడు పృథ్వీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసం ఆస్తులమ్మేశానని తెలిపారు. దాదాపు కోటి రూపాయలు పార్టీ కోసం ఖర్చు చేశానని పేర్కొన్నారు. అయితే చివరికీ తాను ఆస్పత్రిలో ఉంటే ఒక్క బెడ్ ఇప్పించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన పృథ్వీ ఈ సందర్భంగా పలు ఆసక్తికర...

January 25, 2023 / 08:24 PM IST

అదిరిందయ్య సూర్య.. టీ20 ఫార్మాట్ రారాజు నీవేనయ్యా

పొట్టి ఫార్మాట్ లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ స్టైలే వేరు. తనదైన బ్యాటింగ్ తో 2022లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గతేడాది జరిగిన ప్రపంచకప్ లో అతడు చేసిన ఇన్నింగ్స్ అసాధారణమైన ప్రదర్శనే. సూర్య చెలరేగి ఆడుతుంటే క్రీడాభిమానులు పండుగ చేసుకున్నారు. అందులో సిక్సర్లతో చెలరేగిపోయి అత్యధిక పరుగులు సాధించిన సూర్య ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నాడు. 2022 సంవత్సరానికి గాను టీ20 క్రికెటర్ ఆఫ...

January 25, 2023 / 08:07 PM IST

శ్రీ శ్రీ రవిశంకర్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. బెంగళూరు నుంచి తిరుపూర్ వెళ్తుండగా సత్యమంగళం అటవీ ప్రాంతంలో అత్యవసరంగా ఫైలట్ దించారు. దట్టమైన పొగమంచు అలుముకోవడంతో మార్గం కనిపించలేదు. దీంతో చాపర్‌ను కిందకి దించాల్సి వచ్చింది. తమిళనాడు ఈరోడ్ జిల్లా కడంపూర్ హిల్స్ గ్రామం ఉగిన్యాం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో హెలికాప్టర్ దిగింది. హెలిక...

January 25, 2023 / 07:44 PM IST

రాహుల్, అతియా జోడీకి అదిరే గిఫ్ట్ లు.. వావ్ అనాల్సిందే

స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉంది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరలయ్యాయి. అయితే హాజరైన కొద్ది మంది బంధుమిత్రులు, ప్రముఖులు నూతన దంపతులకు ఊహించని రీతిలో బహుమతులు ఇచ్చారంట. పెళ్లి సందర్భంగా అతిథులు కొత్త జంటకు ఖరీదైన ఫ్లాట్, వాచ్ లు, వాహనాలు, ఆభరణాలు ఇచ్చారని సమాచారం. సిన...

January 25, 2023 / 07:12 PM IST

అజ్మీర్ దర్గాకు చాదర్ పంపిన సీఎం కేసీఆర్

అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా సీఎం కేసీఆర్ చాదర్ సమర్పించారు. ప్రతీ ఏటా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాదర్ పంపిస్తుంటారు. ప్రగతి భవన్‌లో బుధవారం మత పెద్దల ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. ప్రజలు, ప్రభుత్వం బాగుండాలని, సీఎం కేసీఆర్‌ను చల్లగా చూడాలని మత పెద్దలు ప్రార్థించారు. రాష్ట్రం ప్రగతి పథంలో సాగాలని, దేశ ప్రజలంతా కలిసి మెలసి జీవించేలా దీవించాలని అల్లాను కోరారు. ఆ తర్వాత చాదర్‌ను వక్ఫ్ బోర్డు అధికార...

January 25, 2023 / 06:35 PM IST

బీసీసీఐ పాలిట లక్ష్మిదేవీలు మహిళా క్రికెటర్లు

క్రికెట్ లో మహిళలకు విశేష ప్రాధాన్యం కల్పించేందుకు బీసీసీఐ మహిళల ప్రీమియర్ లీగ్ నిర్వహించనుంది. ఐపీఎల్ మాదిరి మహిళల కోసం నిర్వహిస్తున్న లీగ్ కు బీసీసీఐ ‘మహిళల ప్రీమియర్ లీగ్’ (Women’s Premier League-WPL) అనే పేరును ఖరారు చేసింది. ఈ లీగ్ లో ఐదు జట్ల కోసం నిర్వహించిన వేలంతో బీసీసీఐకి భారీగా ఆదాయం సమకూరింది. ఐపీఎల్ కు మించిన దానికన్నా అధిక ఆదాయం లభించిందని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించార...

January 25, 2023 / 06:52 PM IST

రిపబ్లిక్ డే జరపాల్సిందే.. పరేడ్ కంపల్సరీ: తెలంగాణ హైకోర్టు

రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు నిర్వహించాల్సిందేనని హైకోర్టు స్పష్టంచేసింది. యావత్ దేశం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటుందని గుర్తుచేసింది. పరేడ్ తప్పనిసరిగా నిర్వహించాలని కోరింది. ఈ వేడుకకు ప్రజలను అనుమతించాలని తెలిపింది. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఉన్నందున రాజ్ భవన్‌లోనే వేడుకలు నిర్వహించాలని లేఖ రాశామని అడ్వకేట్ జనరల్ హైకోర్టు ఎదుట వాదనలు వినిపించారు. అక్కడ జరిగే వేడుకలకు ప్రభుత్వ ప్రతిన...

January 25, 2023 / 05:38 PM IST

అనుష్క పేరుతో సినీ రేంజ్ మోసం.. రూ.51 లక్షలు లూటీ

సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వందలు, వేల మంది రోజు తిరుగుతుంటారు. ఎవరైనా కథ వినకపోతారా? ఎవరైనా సినిమాల్లోకి తీసుకోకపోతారా? ఎవరైనా అవకాశం ఇవ్వకపోతారా? అంటూ ఫొటోలు, కథలు, రచనలు పట్టుకుని స్టూడియోలు, ప్రొడ్యూసర్, హీరోహీరోయిన్ల కోసం గాలిస్తుంటారు. ఈ సందర్భంగా కొందరి ఇళ్ల వద్ద పడిగాపులు కాస్తుంటారు. అపాయింట్ మెంట్ కోసం కాళ్లరిగేలా తిరుగుతారు. అలాంటి అమాయకులను కొందరు మోసగాళ్లు చాలా సులువుగా మోసం చేసేస్...

January 25, 2023 / 05:42 PM IST

పాదయాత్రకు సిద్ధమై లోకేష్.. 4వేలకు పైగా 400 రోజులు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈ నెల 27 నుంచి యువగళం పేరుతో ఏపీలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. కుప్పం నుంచి పాదయాత్రను మొదలుపెట్టి.. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న లోకేష్ నాయుడు భార్య బ్రాహ్మణి వీర తిలకం దిద్దగా యాత్రకు బయల్దేరారు. కాగా.. 400 రోజుల పర్యటనలో లోకేష్ ప్రజలతో మమేకం...

January 25, 2023 / 05:35 PM IST