ఉత్తర ప్రదేశ్ మాఫియా లీడర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ ను (Atiq Ahmed Murder news), అతని సోదరుడు అష్రాఫ్ అహ్మద్ ను ( brother Ashraf) జర్నలిస్ట్ ల ముసుగులో వచ్చి కాల్చి చంపిన విషయం తెలిసిందే. వారు అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించినట్లు పోలీసులు (police) గుర్తించారు. హంతకుల టర్కీకి చెందిన టీసాస్ కంపెనీ తయారు చేసిన సెమీ ఆటోమేటిక్ ఆయుధమైన జిగాన పిస్టల్ ను ఉపయోగించినట్లు గుర్తించారు (9mm Girsan pistol and a 9-mm Zigana pistol). టర్కీలో పాలిమర్ ప్రేమ్ తో తయారైన తొలి పిస్టల్ ఇది. ఈ ఆయుధం ఖరీదు రూ.6 లక్షలకు పైగా ఉంటుంది. టర్కీ సైన్యం, ప్రత్యేక దళాలు, ఇతర సెక్యూరిటీ ఏజెన్సీలు ఈ తుపాకులను ఉపయోగిస్తున్నాయి. మన దేశంలో వీటి పైన నిషేధం ఉంది. పాకిస్తాన్ నుండి వీటిని మన దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. ఈ టర్కీ తుపాకులకు నకిలీ వాటిని పాక్ తయారు చేస్తోంది. వీటి ధర కాస్త తక్కువగా ఉంది. అతీక్ ను 22 ఏళ్ల లవ్లేష్, 18 ఏళ్ల అరుణ్, 23 ఏళ్ల మోహిత్ .. ఈ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ముగ్గురు 9ఎంఎం గిర్సన్ పిస్టల్, 9ఎంఎం జిగానా పిస్టల్, ఏ 30 పిస్టల్ (7.62)ను ఉపయోగించినట్లు గుర్తించారు. నిందితులను 14 రోజుల రిమాండుకు తరలించింది కోర్టు.
ముగ్గురు నిందితులు… తమ కుటుంబాలకు దాదాపు దూరంగా ఉంటున్నారని, ఉద్యోగం లేకుండా ఉన్నారని పోలీసులు చెప్పారు. అటాకర్స్ వద్ద జర్నలిస్టుల వద్ద ఉండే మైక్రోఫోన్, ఐడీ, కెమెరా కూడా ఉన్నాయన్నారు. లవ్లేష్ తండ్రి మాట్లాడుతూ.. తన కొడుక్కు ఎలాంటి ఉద్యోగం లేదని, మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డాడని చెప్పాడు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి తాము టీవీలో చూశామని, తన కొడుకు తమ వద్ద ఎప్పుడూ ఉండటం లేదని చెప్పాడు. ఎప్పుడో ఓసారి వస్తుంటాడని, ఎక్కువగా టచ్ లో ఉండటం లేదన్నాడు. లవ్లేష్ డ్రగ్స్ కు బానిస అయ్యాడన్నాడు. లవ్లేష్ బండాలోని కోత్వాలికి, అరుుణ్ కాస్గంజ్ లోని సోరోన్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో గల బఘేలా పుక్తా గ్రామానికి చెందినవాడు. ఇక, సన్నీ సింగ్ పైన హమీర్ పురి జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి. మూడో వ్యక్తి అరుణ్ కస్గంజ్ జిల్లాకు చెందినవాడు. అతను తన గ్రామాన్ని పదిహేనేళ్ల క్రితమే విడిచి వచ్చాడు. అతని తిరిగి ఇంటికి పోయింది లేదు. ఇతనికి తల్లి లేదు.