Hydలో హై పవర్ రిమాండ్.. నాలుగేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వినియోగం
గ్రేటర్ హైదరాబాద్లో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. నాలుగేళ్ల తర్వాత ఏప్రిల్ నెలలో హై పవర్ డిమాండ్ నెలకొంది. పొద్దంతా ఎండలు ఉండగా.. సాయంత్రం ఉక్కపోతతో ఏసీలు, కూలర్లు ఆన్ చేయడంతో పవర్ డిమాండ్ ఎక్కువ అవుతుంది.
High power demand:గ్రేటర్ హైదరాబాద్లో (Hyderabad) విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. గత నాలుగేళ్ల (4 years) తర్వాత ఏప్రిల్ (april) నెలలో హై పవర్ డిమాండ్ నెలకొంది. పొద్దంతా ఎండలు ఉండగా.. సాయంత్రం ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. అర్ధరాత్రి దాటినా తర్వాతే చల్లని గాలి (air) వస్తోంది. అప్పటివరకు కూలర్లు (cooler), ఏసీలు (ac) ఆన్ చేస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగం పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో (hyderabad city) ఎక్కువగా నమోదైంది.
ఉదయం విద్యుత్ వినియోగం 2800 మెగావాట్ల వినియోగం ఉంటే.. సమయం గడిచేకొద్దీ అదీ పెరుగుతుంది. మధ్యాహ్నం వరకు 3378 మెగావాట్లు దాటుతోంది. ఇక సాయంత్రం అయితే మరీ ఎక్కువగా ఉంటోంది. గత ఏడాది ఏప్రిల్ 28వ (april 28) తేదీకి 3435 మెగావాట్ల విద్యుత్ వినియోగించారు. ఈ ఏడాది మే వరకు అదీ 4031 మెగావాట్లకు చేరుకోనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉదయం 9 గంటలు దాటితే చాలు టెంపరేచర్ (temperature) క్రమంగా పెరుగుతోంది. అందుకే జనాలు ఉదయం 10,11 గంటల్లోపు తమ పనులను పూర్తి చేసుకుంటున్నారు. సాయంత్రం 4,5 గంటలు అయినా ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. ఒక్క హైదరాబాద్ (hyderabad) కాదు.. రాష్ట్రమంతా ఇలానే ఉంది. విద్యుత్ వినియోగం కూడా భారీగా డిమాండ్ ఏర్పడుతుంది.
మళ్లీ వర్షాలు (rains) పడితే తప్ప.. విద్యుత్ వినియోగం తగ్గే అవకాశం లేదు. యాసంగి పంటలకు ఉచిత విద్యుత్ ప్రభుత్వం ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఏకబికిన కాకుండా.. దశలవారీగా పవర్ ఇస్తోంది.