»Hyderabad Boy Who Lost Rs 100 Crores In Cricket Betting In 12 Years
Cricket Betting: బెట్టింగ్‌లో రూ.100 కోట్లు కోల్పోయిన హైదరాబాద్ కుర్రాడు
జూదం ఇది చాలా మందికి నియంత్రించలేని వ్యసనంగా ఉంటుంది. దీని బారిన పడిన వారు అంత ఈజీగా తప్పించుకోలేరు. ఇది ఒక రుగ్మత మాదిరిగా తయారై మనుషులను ఆర్థికంగా నాశనం చేస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్(hyderabad)కు చెందిన ఓ వ్యక్తి సైతం క్రెకిట్ బెట్టింగ్(cricket betting) బారిన పడి రూ.100 కోట్లు పోగొట్టుకున్నాడు. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
పేకాట, క్రికెట్, గుర్రం పందాలు ఇలా అనేక విధాలుగా కొంత మంది బెట్టింగ్(Betting) పెట్టి డబ్బులు సంపాదిస్తారు. అదే క్రమంలో మరికొంత మంది పెద్ద ఎత్తున నష్టపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. అయితే ఈ జూదాలు ఒక్కసారి అలవాటు అంత సులువుగా మానలేరు. ఈ జూదం ఆటలో కొంత మందికి పలు సందర్భాలలో పెద్ద ఎత్తున లాభాలు వచ్చి కోటీశ్వరులు అయిన సంఘటనలు కూడా ఉన్నాయి. మరోవైపు ఈ జూదం మోజులో పడి పలువురు వారి కుటుంబాలను సైతం తాకట్టు పెట్టి అన్నీ పొగొట్టుకున్న సంగతులు కూడా గతంలో చుశాం. అయితే ప్రధానంగా చెప్పాలంటే ఈ జూదం వల్ల లాభపడిన వారి కంటే నష్టపోయిన బాధితులే ఎక్కువగా ఉన్నారు. ఇటీవల ఈ వ్యవసనంతో హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 100 కోట్ల రూపాయలు కోల్పోయాడు. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఇటీవల ఐపీఎల్-2023 క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌ను ఎల్బీ నగర్ జోన్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) చైతన్యపురి పోలీసులు(police) ఛేదించారు. ఆ క్రమంలో రూ.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.1.4 కోట్లను సైతం స్తంభింపజేశారు. హర్యానాకు చెందిన ఇద్దరు బుకీలు, ఒక ప్రధాన బుకీ పరారీలో ఉండగా ఏజెంట్‌తో పాటు ఇద్దరు సబ్ బుకీలను అరెస్టు చేశారు.
తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3, 4 కింద ముగ్గురు నేరస్తులను అరెస్టు చేశారు. ఇద్దరు సబ్ బుకీలలో ఏడుకుళ్ల జగదీష్, జక్కిరెడ్డి అశోక్ రెడ్డి కాగా, వొడుపు చరణ్ కలెక్షన్ ఏజెంట్. ఏపీకి చెందిన ఇద్దరు బుకీలు పలాస శ్రీనివాస్, సురేష్ మైలాబత్తుల, హర్యానాకు చెందిన ప్రధాన బుకీ విపుయిల్ మోంగా పరారీలో ఉన్నారని ఈ మేరకు పోలీసులు(police) వివరాలను వెల్లడించారు.
అయితే వీరిలో వనస్థలిపురానికి చెందిన అశోక్ రెడ్డి గురించి విచారణలో ఆసక్తికర విషయం తెలిసింది. అశోక్ గతంలో రియల్ ఎస్టేట్(real estate) వ్యాపారంలో మంచిగా సంపాదించాడు. ఆ క్రమంలో ఓ సారి క్రికెట్ బెట్టింగ్(cricket betting) వేయగా అతనికి లక్ష రూపాయలు వచ్చాయి. తర్వాత కూడా బెట్టింగ్ వేయగా పలుమార్లు రావడం, ఇంకొన్ని సార్లు మనీ పోవడం జరిగేది. అలా అనేక మంది దగ్గర అప్పులు తీసుకుని మరీ బెట్టింగ్ పెట్టి లాభాల కంటే నష్టాలే ఎక్కువగా చవి చూశాడు. ఎంత అంటే 12 ఏళ్లలో ఏకంగా రూ.100 కోట్లు నష్టపోయాడు. దీంతో అప్పుల బాధలు భరించలేక కొన్ని రోజులు పారిపోయాడు. ఆ తర్వాత అదే బెట్టింగ్ ద్వారా డబ్బులు సంపాదించాలనే ఆశతో బుకీగా మారి చివరికి పోలీసులకు దొరికిపోయాడు.