దేశీయ స్టాక్ మార్కెట్ (stock market) సోమవారం భారీ నష్టాల్లో ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లలో (international market) ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా నిరుత్సాహకర ఐటీ సెక్టార్ (it sector) త్రైమాసిక ఫలితాలు మార్కెట్ల పైన తీవ్ర ప్రభావం చూపాయి. ఉదయం దాదాపు 750 పాయింట్లు నష్టపోయి 60,000 దిగువన ప్రారంభమైన మార్కెట్లు, ఏ దశలోను అంతగా కోలుకోలేదు. మధ్యాహ్నం గం.11.15 సమయానికి కూడా 750 పాయింట్ల మేర నష్టాల్లోనే ట్రేడ్ అయింది. నిఫ్టీ కూడా 150 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అయింది. అమెరికా మార్కెట్లు (america market) గతవారం నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు ఆసియా – పసిఫిక్ సూచీలు అదే బాటలో నడుస్తున్నాయి. ఇన్ఫోసిస్ (infosys) నిరుత్సాహకర ఫలితాలు, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు (hdfc bank) ప్రకటించిన మెరుగైన ఫలితాలు మార్కెట్ల పైన ప్రభావం చూపుతున్నాయి. దీనికి తోడు వరుసగా తొమ్మిది రోజుల ర్యాలీ నేపథ్యంలో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఈ రోజు హోల్ సేల్ ద్రవ్యోల్భణం, విదేశీ కొనుగోళ్లు ప్రభావం కూడా మార్కెట్ పైన ఉంటుంది.
ఇన్ఫోసిస్ షేర్ (infosys share price) ధర నేడు పది శాతం కంటే పైగా నష్టాల్లో కొనసాగుతోంది. ఉదయం రూ.1250 వద్ద ప్రారంభమై, ఓ సమయంలో రూ.1200 దిగువకు పడిపోయింది. 52 వారాల కనిష్టం రూ.1185కు పడిపోవడం గమనార్హం. ఓ సమయంలో ఈ షేర్లు 15 శాతం కూడా పడిపోయాయి. ఇన్ఫోసిస్ ఫలితాల (infosys results) ప్రభావం ఐటీ స్టాక్స్ (it stocks) పైన పడింది. టీసీఎస్ (tcs) రెండు శాతానికి పైగా, హెచ్సీఎల్ టెక్ (hcl tech) షేర్ 3 శాతానికి పైగా, విప్రో (wipro) షేర్ ధర దాదాపు 3 శాతం, టెక్ మహీంద్రా (tech mahindra) షేర్ ధర 5 శాతానికి పైగా క్షీణించింది. ఇదే ఒరవడి కొనసాగితే నేడు రేపు ఐటీ స్టాక్స్ పెద్ద ఎత్తున నష్టపోవచ్చునని, ఈ సమయంలో కొనుగోలుపై ఆలోచన చేయవచ్చునని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.