»Tcs Q4 Results Highlights Net Profit Beats Estimates Revenue Up 3 5
TCS : అంచనాలకు మించిన లాభాల్లో టీసీఎస్
మన దేశంలో అతి పెద్ద ఐటీ సంస్థగా పేరు పొందిన టీసీఎస్ మార్చితో ముగిసిన త్రైమాసికంలో మంచి లాభాలను సాధించింది. అంచనాలను మించి మరీ నికర లాభాలను నమోదు చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
TCS Net Profit : ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగం ఇప్పుడు ఒడొదొడుకుల్లో ఉంది. అంతా రెసిషన్ టైం అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలు ఐటీ సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత పెడుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో 9.1 శాతం వృద్ధితో ఏకంగా రూ.12,434 కోట్ల నికర లాభాన్ని(Net profit) నమోదు చేసింది. మొత్తంగా చూసుకుంటే సంస్థ ఆదాయం 3.5 శాతం పెరిగి రూ.61,237 కోట్లకు చేరింది. నిర్వహణ లాభాల మార్జిన్ కూడా 1.50 శాతం పెరిగి 26 శాతానికి చేరుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగం క్లిష్ట స్థితిలో ఉన్న పరిస్థితుల్లో కూడా భారత ఐటీ దిగ్గజం ఇలా లాభాలను ఆర్జించడం విశేషం. గతేడాది జనవరి-మార్చి త్రైమాసికంలో టాటా గ్రూప్ కంపెనీ రూ.11,392 కోట్ల లాభాన్ని సాధించింది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం 9 శాతం పెరిగి రూ.45,908 కోట్లకు చేరిందని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది.
ఇలా టీసీఎస్(TCS) లాభాల్లో ఉండటంతో సంస్థ మదుపరులకు కూడా ఆ లాభాలను పంచేందుకు డివిడెండ్ ప్రకటించింది. దీని ప్రకారం షేర్ హోల్డర్లకు ఒక్కో షేర్‌పై రూ.28 డివిడెండ్ లభించనుంది. దీంతో స్టాక్ హోల్డర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.