ఇండియా(India)లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 50 బ్రాండ్లలో టీసీఎస్(TCS) మొదటి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ ఐటీ దిగ్గజ సేవల సంస్థ అయిన టీసీఎస్ బ్రాండ్ విలువ రూ.1,09,577 కోట్లుగా ఉంది. ఈ విషయాన్ని బ్రాండ్ కన్సల్టింగ్ సేవల సంస్థ ఇంటర్ బ్రాండ్(InterBrand) వెల్లడించింది. టీసీఎస్(TCS) తర్వాత రిలయన్స్(Reliance), ఇన్ఫోసిస్(Infosis) సంస్థలు నిలిచాయి.
రూ.65,321 కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్(Releance industries) రెండో స్థానంలో నిలిచింది. టీసీఎస్(TCS) తర్వాత ఇది రెండో అతి పెద్ద విలువైన సంస్థగా నమోదైంది. టీసీఎస్, రిలయన్స్ తర్వాత మూడో స్థానంలో ఇన్ఫోసిస్(Infosis) నిలిచింది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ విలువ రూ.53,324 కోట్లుగా ఉంది. ఆ తర్వాత నాలుగో స్థానంలో హెచ్డీఎఫ్సీ(HDFC) బ్యాంక్ రూ.50,291 కోట్ల విలువతో కొనసాగుతోంది.
జియో(JIO) సంస్థ రూ.49,027 కోట్లు విలువతో 5వ స్థానంలో ఉంది. ఇకపోతే భారతీయ ఎయిర్టెల్(Airtel), ఎల్ఐసీ(LIC), మహీంద్రా(Mahindra), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank Of India), ఐసీఐసీఐ(ICICI) వంటి సంస్థలు టాప్-10లోని మిగతా బ్రాండ్లుగా నిలిచాయి. ఈ జాబితాలోని 50 బ్రాండ్ల మొత్తం విలువ రూ.8.31 లక్షల కోట్లుగా ఉన్నట్లు బ్రాండ్ కన్సల్టింగ్ సేవల సంస్థ ఇంటర్ బ్రాండ్ తెలిపింది. గత దశాబ్దకాలంలో ఈ బ్రాండ్ల విలువ 167 శాతం పెరిగిందని ఇంటర్‌బ్రాండ్(InterBrand) వెల్లడించింది.