TCS Company Americans are worried that they will take our jobs
LinkedIn Top Rankings : ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ ఫాం లింక్డిన్ 2024 టాప్ కంపెనీల జాబితాని విడుదల చేసింది. ఆ జాబితాలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ (టీసీఎస్) అగ్రస్థానంలో నిలిచింది. టీసీఎల్ తర్వాతి స్థానాల్లో యాక్సెంచర్, కాగ్నిజెంట్లు నిలిచాయి. ఇవి మూడు సంస్థలు దేశంలో టాప్ 3 సంస్థలుగా ఉన్నాయని లింక్డిన్ తెలిపింది.
లింక్డిన్ మంగళవారం విడుదల చేసిన ఈ జాబితా ప్రకారం… ఫైనాన్సియల్ సర్వీసెస్ కంపెనీలైన మ్యాక్క్వేరీ గ్రూప్ (4వ స్థానం), మెర్గాన్ స్టాన్లీ (5వ స్థానం), జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో (6వ స్థానం)లో ఉన్నాయి. అలాగే ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో అగ్రగామి టెక్ కంపెనీలన్నీ ఉన్నాయని తెలిపింది. బెంగళూరు తర్వాత హైదరాబాద్, ముంబయి, పూనేలు ఉన్నాయి.
250 నుంచి 500 మంది ఉద్యోగులు ఉన్న మిడ్ సైజ్ కంపెనీల్లో ‘సాఫ్ట్వేర్-యూజ్-ఏ-సర్వీస్’ (SaaS) ప్లాట్ఫామ్ ‘లెంట్రా’ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇండియన్ ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫాం ‘మేక్ మై ట్రిప్’ రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఫ్యాషన్ అండ్ బ్యూటీ రిటైలర్ ‘నైకా’, ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ ‘డ్రీమ్ 11’ కూడా స్థానం సంపాదించుకున్నాయి.