»Linkedin Reconnect Childhood Woman Friends After 15 Years
LinkedIn: చిన్నప్పటి దోస్తులను..15 ఏళ్ల తర్వాత కల్పిన లింక్డ్ఇన్
ప్రస్తుత కాలంలో అనేక మంది పలు ప్రాంతాల్లో చదువుకుంటారు. ఆ నేపథ్యంలో కొంత మంది మంచి స్నేహితుల(best friends)ను కూడా మిస్సవుతూ ఉంటాము. అచ్చం అలాంటి సంఘటనే ఇటివల జరిగింది. అయితే అలా దూరమైన స్నేహితులు 15 ఏళ్ల తర్వాత లింక్డ్ ఇన్ ద్వారా కలుసుకోవడం విశేషం. దీంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
LinkedIn reconnect childhood friends after 15 years
ఇటివల 15 ఏళ్ల తర్వాత ఇద్దరు స్నేహితులు(woman friends) మళ్లీ కలుసుకున్నారు. అది కూడా మామాలుగా కాదండోయ్. సోషల్ మీడియా ప్లాట్ ఫాం లింక్డ్ ఇన్(LinkedIn) ద్వారా అనుకోకుండా మీట్ అయ్యారు. అయితే వీరిద్దరు స్కూల్ ప్రొఫైల్స్ సహా పలు అంశాలు సేమ్ ఉండటంతో వీరిద్దరూ ఒకరినొకరు కలుసుకునేందుకు దోహదపడింది. దీంతో వారిద్దరూ సోషల్ మీడియా ప్లాట్ ఫాం లింక్డ్ ఇన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ క్రమంలో తన అనుభవాన్ని ఆమె పంచుకున్నారు. తమను మళ్లీ ఒకచోట చేర్చడంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫాం చూపిన చొరవ పట్ల ఆ మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.
లింక్డ్ఇన్ 15 సంవత్సరాల తర్వాత తన చిన్ననాటి బెస్ట్ ఫ్రెండ్(childhood woman friends)తో తిరిగి కలిపేసిందని ఆమె ట్విట్టర్ ద్వారా రాసుకొచ్చారు. ఈ క్రమంలో బర్నాలి అనే మహిళ లింక్డ్ఇన్లో తన సంభాషణ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. చాలా సంతోషంగా ఉందని తెలిపింది. తన చిరకాల స్నేహితురాలు దొరికిందని, ఈ టెక్, సోషల్ ప్లాట్‌ఫారమ్‌లు కొన్నిసార్లు పాత స్నేహితులను నిజమైన మిత్రలను ఏకం చేస్తాయని చెప్పుకొచ్చింది. అయితే మీరు సోషల్ మీడియా సహాయంతో ద్వారా ఎప్పుడైనా కోల్పోయిన స్నేహితుడిని కలుసుకున్నారా? అవునా లేదా కాదా అనే విషయాన్ని కామెంట్(comments) రూపంలో తెలియజేయండి.
LinkedIn literally reunited me with my childhood best friend after 15 years😭🫶 pic.twitter.com/QYEvYaobuG