»Traffic Jam In Space Delayed July Rocket Launch Isro Chief
Spaceలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్..నెక్ట్స్ ఏంటి?
స్పేస్లో కూడా ట్రాఫిక్ జామ్ అవుతోంది. అవును.. అంతరిక్ష ప్రయోగాలతో అక్కడ వ్యర్థాలు భారీగా పేరుకుంటున్నాయి. మెజార్టీ అమెరికా, రష్యా, చైనాకు చెందిన వ్యర్థాలు ఉన్నాయని ఇస్రో చెబుతోంది.
Traffic Jam In Space Delayed July Rocket Launch: ISRO Chief
Traffic Jam In Space: రోడ్లపై రద్దీ తెలుసు.. మరీ అంతరిక్షంలో (Space) తెలియదు కదా. అక్కడ కూడా ట్రాఫిక్ పెరిగిందట. అక్కడ రాకెట్ల ప్రయోగాలతో స్పేస్ నిండిందట. గత నెలలో ప్రయోగాలు కాస్త ఆలస్యం అయ్యాయని ఇస్రో చెబుతోంది. వినడానికి కాస్త వింతగా ఉన్నా.. ఇది నిజం. ప్రపంచంలో మెజార్టీ దేశాలు అంతరిక్షంలో ప్రయోగాలు చేస్తున్నాయి. దీంతో 27 వేల అంతరిక్ష వస్తువులు ఉన్నాయి. వీటిలో 80 శాతం వ్యర్థాలేనని తెలుస్తోంది. వీటిలో 10 సెంటిమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో మిలియన్ల కొద్దీ ఉన్నాయని.. ఇవీ అంతరిక్ష ప్రయోగాలకు ప్రమాదకరంగా మారుతున్నాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చైర్మన్ ఎస్ సోమనాథ్ (somnath) వెల్లడించారు.
మినిట్ లేట్
యాంటీ శాటిలైట్ పరీక్షల ద్వారా అంతరిక్ష వ్యర్థాలకు ముప్పు వాటిల్లుతోంది. అమెరికా (america), రష్యా (russia), చైనా (china), భారత్ ప్రయోగిస్తోన్న ఆయుధ సామర్థ్యం ద్వారా ప్రమాదం ఉంది. దీంతో జూలై 30వ తేదీన ఇస్రోకు (ISRO) చెందిన పీఎస్ఎల్వీ ప్రయోగానికి ముందు ఉత్కంఠ నెలకొంది. శ్రీహరికోట నుంచి ప్రయోగించే రాకెట్ నిమిషం వాయిదా పడిందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. వాస్తవానికి ఉదయం 6.30 గంటలకు రాకెట్ ప్రయోగించాల్సి ఉంది. అదీ ఉదయం 6.31 గంటలకు నింగిలోకి ఎగసిందని వివరించారు. ఆ రోజు చేసిన ప్రయోగం మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ సింగపూర్ దేశం యొక్క తొలి పీఎస్ఎల్వీ రాకెట్ ప్రత్యేకమైన కక్ష్యను తగ్గించే ప్రయోగాన్ని నిర్వహించింది. భూమికి 536 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తోన్న పీఎస్ఎల్వీ నాలుగో దశను ఉద్దేశపూర్వకంగా 300 కిలోమీటర్ల కక్ష్యలోకి తగ్గించారు. ఇస్రో యొక్క స్వచ్చంద అంతరిక్ష అభియాన్ లేదంటే అంతరిక్ష వ్యర్థాలను తగ్గించే స్పేస్ క్లీన్ ప్రయత్నంలో భాగం అని ఇస్రో చైర్మన్ సోమనాథ్ (somnath) తెలిపారు.
వ్యర్థాల తొలగింపు
వసుదైవ కుటుంబం స్ఫూర్తితో ఇస్రో స్వచ్చందంగా అంతరిక్షంలో ఉన్న వ్యర్థాలను తగ్గించేందుకు తన కక్ష్య ఎత్తును తగ్గించుకుందని సోమనాథ్ (somnath) వివరించారు. కక్ష్యను 300 కిలోమీటర్లు తగ్గించడంతో పీఎస్ఎల్వీ 4వ దశలో భూమికి తిరిగి ప్రవేశించి, 30 రోజుల్లో కాలిపోతుందని చెబుతున్నారు. అంతరిక్షంలో ఘన వ్యర్థాల తొలగింపు ప్రక్రియ కోసం ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పనికిరాని మేఘట్రోపిక్స్ ఉపగ్రహాన్ని భారత్ కూడా సురక్షితంగా నిర్వీర్యం చేసిందని వివరించారు.
అమెరికావే ఎక్కువ
కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలను ఉపయోగించి ఆధునాతన రాడార్, ఆప్టికల్ సాధనాలను అమెరికా స్పేస్ కమాండ్ 10 సెంటిమీటర్లు అంతకన్నా ఎక్కువ 26, 783 అంతరిక్ష వస్తువులు, పెయింట్ ప్లెక్స్ వంటి మిలియన్ల చిన్న వస్తువులను కలిగి ఉంది. స్పేస్లో అమెరికా వ్యర్థాల వాటా 40 శాతంగా ఉంటుంది. యూఎస్ఎస్ఆర్, రష్యాకు చెందినవి 28 శాతం ఉంటాయి. 19 శాతం చైనా వ్యర్థాలు ఉంటాయని ఇస్రో పేర్కొంది. అంతరిక్షంలో భారత వ్యర్థాలు తక్కువగా అంటే కేవలం 217 వస్తువులు.. 0.8 శాతం మాత్రమే ఉన్నాయని ఇస్రో చెబుతోంది.