»Chandrayaan 3 Send Pictures Of The Moon Isro Share To Twitter
Chandrayaan3: చంద్రుని చిత్రాలు పంపింది చుశారా?
జాబిల్లి(moon)పైకి వెళ్లిన చంద్రయాన్ 3(Chandrayaan 3) ఉపగ్రహం ఎట్టకేలకు చంద్రుడి చెంతకు చేరింది. ఆ క్రమంలో చంద్రుడి దగ్గరి వైపు చిత్రాలను పంపించింది. అయితే అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) అంతరిక్ష నౌక చంద్రయాన్-3(Chandrayaan 3) చంద్రుడి ఉపరితలం వైపు విజయవంతంగా దూసుకెళ్లింది. అయితే ఇప్పటికే జాబిల్లి సమీపంలోకి చేరిన ఈ ఉపగ్రహం తాజాగా చంద్రుడి చిత్రాలను క్లిక్ చేసి పంపించింది. వాటిని ఇస్రో అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ మేరకు చంద్రుని చిత్రాలను ఆదివారం పోస్ట్ చేశారు. ఇస్రో చేపట్టిన చంద్రయాన్3 చంద్రుని గురించి అన్వేషణ చేపట్టడమే లక్ష్యంగా అంతరిక్ష నౌక శనివారం చంద్రుని కక్ష్యకు చేరుకుంది. ఆదివారం రాత్రి తన మొదటి చంద్ర కక్ష్య విన్యాసాన్ని పూర్తి చేసింది. ఇస్రో ప్రకారం కక్ష్య తగ్గింపు యుక్తి విజయవంతంగా పూర్తయిందని అధికారులు పేర్కొన్నారు. అంతరిక్ష నౌకను 170 కిమీ x 4313 కిమీ దూరంలో చంద్రుని ఉపరితలానికి దగ్గరగా తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.
ఈ వ్యోమనౌకను విజయవంతంగా ప్రణాళికాబద్ధమైన కక్ష్య తగ్గింపు ప్రక్రియను చేపట్టారు. ఇంజిన్ల రీట్రోఫైరింగ్ దానిని చంద్రుని ఉపరితలానికి దగ్గరగా, 170 కి.మీ x 4313 కి.మీ. కక్ష్యను మరింత తగ్గించడానికి తదుపరి ఆపరేషన్ ఆగస్టు 9న షెడ్యూల్ చేయబడిందని అధికారులు(officers) వెల్లడించారు. ఆ తర్వాత ప్రక్రియలో భాగంగా చంద్రయాన్ 3..ఆగస్టు 23న చంద్రుని(moon)పై ల్యాండ్ కానుంది. చంద్రయాన్-3 అనేది చంద్రయాన్ కార్యక్రమంలో మూడవ మిషన్. ఇది ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్‌ను కలిగి ఉంది. చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం, రోవర్‌ను మోహరించడంలో అంతరిక్ష నౌక ఇస్రో రెండవ ప్రయత్నం. చంద్రుని ఉపరితలం దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంపై ఇండియా చేసిన మొట్టమొదటి ప్రయత్నం కూడా ఇదే కావడం విశేషం.